Balakrishna: బాలయ్య సమాధానంతో వాళ్లు సైలెంట్ అవుతారా?

అక్కినేని తొక్కినేని అనే కామెంట్ ను బాలయ్య కావాలని చేయలేదని పొరపాటున బాలయ్య నోరు జారారని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం. అయితే తాజాగా బాలయ్య కూడా ఆ వివాదం గురించి క్లారిటీ ఇచ్చారు. తాను ఎవరినీ కించపరిచే విధంగా కామెంట్ చేయలేదని బాలయ్య చెప్పుకొచ్చారు. తాను చేసిన కామెంట్ యాదృచ్ఛికంగా చేసిందేనని బాలయ్య తెలిపారు. ఏఎన్నార్ ను బాబాయ్ అని పిలుస్తానని బాలకృష్ణ పేర్కొన్నారు. ఆయన తన పిల్లల కంటే ఎక్కువగా నాపై ప్రేమను చూపిన సందర్భాలు ఉన్నాయని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

పొగడ్తలకు పొంగిపోకూడదని ఆయన నుంచి నేర్చుకున్నానని బాలయ్య వెల్లడించారు. బాలయ్య చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. బాలయ్య క్లారిటీ ఇచ్చిన నేపథ్యంలో ఆయనపై విమర్శలు ఆగుతాయేమో చూడాలి. స్టార్ హీరో బాలకృష్ణ ప్రస్తుతం ఒక్కో సినిమాకు 16 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. అనిల్ మూవీకి బాలయ్య 14 కోట్ల రూపాయల పారితోషికం అందుకుంటున్నారు. బాలయ్య అతి త్వరలో కొత్త ప్రాజెక్ట్ లను కూడా ప్రకటించనున్నారు.

బాలయ్యతో పని చేయడానికి యంగ్ జనరేషన్ డైరెక్టర్లలో చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు.బాలయ్య మాస్ మసాలా సినిమాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. బాలయ్య కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు. బాలయ్య రేంజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. బాలకృష్ణ కొత్త సినిమాలు సైతం అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయని సమాచారం అందుతోంది. బాలయ్య వరుసగా మాస్ సినిమాలతో విజయాలను అందుకుంటున్నారు.

సినిమా సినిమాకు హీరోగా మార్కెట్ ను పెంచుకుంటూ కెరీర్ ను కొనసాగిస్తున్నారు. బాలకృష్ణ యంగ్ జనరేషన్ హీరోలకు కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. యంగ్ హీరోలతో కూడా బాలయ్య క్లోజ్ గా మెలుగుతున్నారు. చాలామంది హీరోలు బాలయ్యతో మల్టీస్టారర్స్ చేయాలని భావిస్తుండటం గమనార్హం.

హంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పఠాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

సౌందర్య టు శృతి హాసన్.. సంక్రాంతికి రెండేసి సినిమాలతో పలకరించిన హీరోయిన్ల లిస్ట్..!
అతి తక్కువ రోజుల్లో వంద కోట్లు కొల్లగొట్టిన 10 తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus