తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నందమూరి తేజస్విని దంపతులు.!

  • February 23, 2024 / 04:25 PM IST

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన నందమూరి బాలకృష్ణ వరుస విజయాలను సొంతం చేసుకోవడంతో పాటు ఓటీటీ షోలతో సైతం సక్సెస్ ను అందుకుంటున్నారు. బాలయ్య పెద్ద కూతురు నారా బ్రాహ్మణి ఇప్పటికే బిజినెస్ ఉమెన్ గా సత్తా చాటారు. తెలుగుదేశం పార్టీకి సైతం నారా బ్రాహ్మణి తన వంతు సహాయ సహకారాలను అందిస్తున్నారు. అయితే బాలయ్య వరుస సక్సెస్ లకు కారణం ఒక విధంగా బాలయ్య చిన్నకూతురు కూడా అని తెలుస్తోంది.

‘రూలర్’ సినిమా వరకు బాలయ్యే తన సినిమాల కథలను ఎంపిక చేసుకునేవారు. కానీ ఆ సినిమా వరకు బాలయ్యకి ప్లాపులు పడటంతో తేజస్విని రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ఇప్పుడు బాలయ్యకి కథ చెప్పాలంటే.. ముందుగా అది తేజస్విని విని ఫైనల్ చేయాల్సిందే. బాలయ్యకి కూడా చిన్న కూతురు ఎంత చెబితే అంత! కాబట్టి ఆమె మాట కాదని బాలయ్య ఏమీ చేయడు. భగవంత్ కేసరి సక్సెస్ సెలబ్రేషన్స్ లో భాగంగా అనిల్ రావిపూడి సైతం తేజస్విని పేరును ప్రత్యేకంగా ప్రస్తావించి ప్రశంసించారు.

బాలయ్య ( Balakrishna) కూతురు టాలెంట్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. రాబోయే రోజుల్లో బాలయ్య చిన్న కూతురు తేజస్విని నిర్మాతగా అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారని గతంలో ప్రచారం జరగగా ఆ ప్రచారం నిజం కానుందని తెలుస్తోంది. బాలయ్యతో లేదా మోక్షజ్ఞతో తైజస్విని సినిమా చేయనున్నారని సమాచారం. అయితే నిర్మాణ రంగంలో తేజస్విని సక్సెస్ అవుతారో లేదో చూడాల్సి ఉంది.

నిన్న (ఫిబ్రవరి 22 గురువారం) ఉదయం బాలకృష్ణ కూతురు నందమూరి తేజస్విని భర్త భరత్​, కుమారునితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకుని ఆశీస్సులు తీసుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అధికారులు ఘనంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఇలా స్వామివారి దర్శనం అనంతరం తేజస్విని వెంకటేశ్వర స్వామి వారికి కానుకలు, మెుక్కులు సమర్పించుకున్నారు. వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితుల ఈ దంపతులకు ఆశీర్వర్వదించి తీర్ధ ప్రసాదాలను అందజేశారు.

ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 18 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్.!

యూట్యూబ్లో వందల కొద్దీ మిలియన్ల వ్యూస్ నమోదు చేసిన పాటల లిస్ట్
ఆ విషయంలో నేను బాధ పడలేదు.. ఉపాసన కామెంట్స్ వైరల్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus