NBK107: ‘సింహా’ల సినిమా అనౌన్స్‌మెంట్‌ వచ్చేసింది

బాలకృష్ణ సినిమా అంటే సింహం ఉండకతప్పదు. పేరులోనో, పోస్టర్‌లోనో ఎక్కడో దగ్గర సింహం వచ్చి తీరుతుంది. తాజాగా బాలకృష్ణ 107వ సినిమా అనౌన్స్‌మెంట్‌ వచ్చేసింది. బాలకృష్ణ – గోపీచంద్‌ మలినేని కాంబోలో రాబోతున్న ఈ సినిమా గురించి చిత్రబృందం వీడియో ద్వారా అనౌన్స్‌ చేశారు. అందులో రెండే ఫొటోలు కనిపిస్తున్నాయి. ఒకటి ఈ రోజు బర్త్‌డే బాయ్‌ నందమూరి బాలకృష్ణ, రెండోది సింహం. అలా అభిమానులు ఇన్నాళ్లుగా ఎదురుచూస్తున్న సినిమా ప్రకటన వచ్చింది.

‘అఖండ’ తర్వాత బాలకృష్ణ – గోపీచంద్‌ మలినేని కలసి పని చేస్తారని చాలా రోజుల నుండి వార్తలొస్తున్నాయి. అయితే అధికారిక సమాచారం మాత్రం రాలేదు. ఎట్టకేలకు ఈ రోజు బాలయ్య జన్మదినం సందర్భంగా సినిమాను ప్రకటించారు. వీడియో ఆఖరులో వేట త్వరలో మొదలు అంటూ అభిమానుల్లో ఊపు తీసుకొచ్చింది చిత్రబృందం. ఈ సినిమాకు తమన్‌ సంగీత దర్శకత్వం వహిస్తారు. ఈ వీడియోకు ఇచ్చిన మ్యూజిక్‌ కొంచెం ‘అయ్యప్పనుమ్‌ కొషియమ్‌’ రీమేక్‌ సినిమా మ్యూజిక్‌కి దగ్గరగా ఉన్నా… సూపర్‌ ఉంది.

ఇక ఈ సినిమా సంగతి చూస్తే… వేటపాలెం నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని వార్తలొస్తున్నాయి. ఇందులో ఇద్దరు నాయికలు ఉండగా, వారిలో ఒకరు శ్రుతి హాసన్‌ అని సమాచారం. మరో నాయిక గురించి వేట జరుగుతోంది. త్వరలో ఈ విషయమై అధికారక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ‘అఖండ’ పూర్తైన వెంటనే ఆయన గోపీచంద్‌ మలినేని ప్రాజెక్ట్‌లోకి అడుగుపెట్టనున్నారు బాలయ్య. అయితే ఎప్పుడు అనేది తెలియడం లేదు.



ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus