Pushpa, Saaho: అక్కడ ఇప్పటికీ ‘సాహో’ నే హైయెస్ట్.. కానీ ‘పుష్ప’ గ్రేట్ అంటారు!

‘బాహుబలి'(సిరీస్) (Baahubali) తర్వాత ప్రభాస్ (Prabhas) హీరోగా ‘సాహో’ (Saaho) అనే సినిమా రూపొందింది. ‘రన్ రాజా రన్’ (Run Raja Run) అనే ఒక్క చిత్రం అనుభవం ఉన్న సుజీత్ (Sujeeth) దర్శకుడు. ‘బాహుబలి’ (సిరీస్) తర్వాత ‘సుజీత్ వంటి దర్శకుడికి ఛాన్స్ ఎలా ఇచ్చాడు ప్రభాస్’ అంటూ ఆ టైంలో ప్రభాస్ పై నెగిటివ్ కామెంట్లు చేసిన వాళ్ళు చాలా మందే ఉన్నారు. బహుశా అదే చిన్న చూపుతో ‘సాహో’ ని చూసినట్టు ఉన్నారు చాలా మంది ప్రేక్షకులు. అందుకే సినిమా డిజాస్టర్ అయ్యింది.

Pushpa, Saaho:

కానీ ఇప్పుడు అంటే 5 ఏళ్ళ తర్వాత ‘ ‘సాహో’ అండర్రేటెడ్ మూవీ’ అని కామెంట్ చేయని వాళ్ళు అంటూ లేరు. ఏది ఏమైనా ప్లాపు.. ఫ్లాపే..!అయినప్పటికీ ‘సాహో’ వంటి ప్లాప్ సినిమా క్రియేట్ చేసిన వండర్స్ చాలా ఉన్నాయి. అవే రికార్డుల గురించి చెబుతున్నా..! ఫుల్ రన్లో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.430 కోట్లు పైగా కలెక్ట్ చేసింది అంటే అతిశయోక్తి అనిపించుకోదు. మెయిన్ గా చెప్పాలంటే..

నార్త్ లో ‘సాహో’ చిత్రం రూ.125 కోట్ల వరకు నెట్ కలెక్షన్స్ ను సాధించింది. ‘బాహుబలి’ తర్వాత అంత మొత్తం ఓ తెలుగు సినిమా కలెక్ట్ చేస్తుంది అని.. అంచనా వేసిన వాళ్ళు లేరు.! ఇంకా చెప్పాలంటే నార్త్ లో ‘పుష్ప'(‘పుష్ప ది రైజ్)(Pushpa)  చిత్రం కలెక్షన్స్ ‘సాహో’ కంటే తక్కువ అంటే నమ్ముతారా? కానీ ఇది నిజం.

‘పుష్ప’ మొదటి భాగం అక్కడ కలెక్ట్ చేసింది రూ.108 కోట్ల నెట్ కలెక్షన్స్. ‘సాహో’ ఎక్కువ కలెక్ట్ చేసినప్పటికీ.. నార్త్ ఆడియన్స్ ‘పుష్ప’ గురించే గొప్పగా చెబుతుంటారు నేటితో ‘సాహో’ రిలీజ్ అయ్యి 5 ఏళ్ళు పూర్తి కావస్తోంది. 2019 ఆగస్టు 30న ఈ సినిమా రిలీజ్ అయ్యింది. ఈ క్రమంలో ‘సాహో’ , ‘పుష్ప’..ల గురించి పై విధంగా సోషల్ మీడియాలో డిస్కషన్స్ జరుగుతున్నాయి.

ఆ విషయంలో జాగ్రత్త పడకపోతే.. కష్టమేనా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus