Balakrishna: కుర్ర స్టార్‌ హీరో కోసం మాటలిస్తున్న బాలయ్య.. ఏ సినిమా కోసమంటే?

కొన్ని సినిమాలకు వాయిస్‌ ఓవర్‌లు ఇంపార్టెంట్‌.. అలాంటప్పుడు ఆ వాయిస్‌ ఓవర్‌ ఎవరు ఇస్తున్నారు అనేది కూడా ఇంపార్టెంట్‌. ఇంటెన్స్‌ యాక్షన్‌ ఉన్న సినిమాలకు, ఎమోషనల్‌ కోషియెంట్‌ ఎక్కువగా ఉన్న సినిమాలకే ఈ అవసరం ఉంటుంది అంటుంటారు. టాలీవుడ్‌లో ఇప్పుడు ఈ రెండు అంశాలతో తెరకెక్కుతున్న చిత్రం విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda) – గౌతమ్‌ తిన్ననూరి (Gowtam Tinnanuri)  సినిమా. ‘VD12’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర విషయం తెలుస్తోంది.

Balakrishna

ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరికొత్త మాస్ అవతారంలో కనిపిస్తాడు. ఈ మేరకు లుక్‌ బయటకు వచ్చి అందరినీ థ్రిల్‌ చేసింది కూడా. దీంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. దానికి మరో ఎలిమెంట్‌ ఇప్పుడు యాడ్‌ చేయొచ్చు. అదే నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) గొంతు. అవును ఈ సినిమా కోసం బాలయ్య వాయిస్‌ ఓవర్‌ ఇస్తారు అని సమాచారం. ఈ మేరకు త్వరలో రికార్డింగ్‌ ఉంటుంది అని చెబుతున్నారు.

విజయ్‌ దేవరకొండ సినిమా నిర్మాత.. బాలయ్య ఇప్పుడు చేస్తున్న బాబీ (Bobby)  సినిమా నిర్మాత ఇద్దరూ ఒక్కరే. అందులోనూ నాగవంశీకి, బాలయ్యకు ఈ మధ్య బాగా సింక్‌ కుదిరింది అంటున్నారు. ఆ అనుబంధం కారణంగానే విజయ్‌ దేవరకొండ సినిమాకు వాయిస్‌ ఓవర్‌ ఇవ్వడానికి బాలయ్య ముందుకొచ్చారు అని అంటున్నారు. మరోవైపు విజయ్‌ అన్నా కూడా బాలయ్యకు అభిమానమే. సినిమాలో కీలకమైన సమయాల్లో ఓ పవర్‌ ఫుల్‌ వాయిస్‌ ఓవర్‌ అవసరం అయిందని.. అది బాలయ్య అయితే బాగుంటుంది అని టీమ్‌ భావించిందట.

అందుకే ఆయన్ను రిక్వెస్ట్‌ చేశారు అంటున్నారు.మరి బాలయ్య మాటల తూటాలు ఎలా ఉంటాయి.. వాటి బట్టి విజయ్‌ ఎలాంటి నటనను ప్రదర్శిస్తాడు అనేది చూడాలి. ఇక ఈ సినిమాను వచ్చే ఏడాది మార్చి ఆఖరులో రిలీజ్‌ చేయాలని చూస్తున్నారు. మిగిలిన సినిమాల డేట్స్‌ మార్పుల నేపథ్యంలో ఈ సినిమాకూ మార్పు ఉంటుందని అంచనా.

‘మట్కా’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus