Balakrishna , Harish Shankar: ఆ అనుమానాలకు హరీష్ శంకర్ చెక్ పెడతారా?

టాలీవుడ్ ఇండస్ట్రీలోని టాలెంటెడ్ డైరెక్టర్ల జాబితాలో హరీశ్ శంకర్ ముందువరసలోఉంటారు. ఈ డైరెక్టర్ తీసింది తక్కువ సినిమాలే అయినా ఆ సినిమాలు మాస్ ప్రేక్షకులను అలరించేలా ఉండటంతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉంటాయి. షాక్ సినిమాతో కెరీర్ ను మొదలుపెట్టిన హరీష్ శంకర్ నందమూరి స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో రామయ్యా వస్తావయ్యా సినిమాను తెరకెక్కించారు. అయితే మొదట హరీష్ శంకర్ అనుకున్న కథ ఒకటి కాగా అదే సమయంలో రెబల్ మూవీ రిలీజ్ కావడం

ఆ కథకు తన సినిమా కథకు పోలికలు ఉండటంతో హరీష్ శంకర్ స్క్రిప్ట్ ను మార్చి రామయ్యా వస్తావయ్యా సినిమాను తెరకెక్కించారు. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా ఎన్టీఆర్ అభిమానులకు నచ్చినా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విషయంలో మాత్రం ఫెయిలైందనే సంగతి తెలిసిందే. రామయ్యా వస్తావయ్యా మూవీ ఫస్టాఫ్, ఇంటర్వెల్ ట్విస్ట్ అద్భుతంగా ఉన్నా సెకండాఫ్ రొటీన్ గా ఉండటం, సెకండాఫ్ లో తారక్ ఫ్యాన్స్ ఆశించే సన్నివేశాలు లేకపోవడం,

రొటీన్ క్లైమాక్స్, థమన్ బీజీఎం ఆశించిన రేంజ్ లో లేకపోవడం ఈ సినిమాకు మైనస్ అయ్యాయి. ఈ సినిమాలో పల్లెటూరి అమ్మాయి పాత్రలో కనిపించిన శృతి హాసన్ డ్రెస్సింగ్ పై కూడా విమర్శలు వచ్చాయి. అయితే ఒక సందర్భంలో హరీష్ శంకర్ మాట్లాడుతూ తారక్ మరో ఛాన్స్ ఇస్తే కచ్చితంగా ప్రూవ్ చేసుకుంటానని చెప్పారు. అయితే బాలయ్య హరీష్ శంకర్ కాంబోలో రాబోయే రోజుల్లో కచ్చితంగా ఒక సినిమా రానుంది.

రామయ్యా వస్తావయ్యా రిజల్ట్ నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్ విషయంలో నందమూరి ఫ్యాన్స్ ఒకింత టెన్షన్ పడుతున్నారు. అయితే హరీష్ శంకర్ బాలయ్యతో అద్బుతమైన సినిమాను తీసి ఫ్యాన్స్ లో నెలకొన్న అనుమానాలకు చెక్ పెడతారేమో చూడాలి.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus