తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో సీనియర్ నటుడు బాలకృష్ణ ఒకరు. అయితే ఈయన కుమారుడు మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ కోసం అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.అదిగో మోక్షజ్ఞ ఎంట్రీ ఇదిగో మోక్షజ్ఞ ఎంట్రీ అంటూ ఈయన సినిమా ఎంట్రీ గురించి ఎన్నో రకాల వార్తలు వచ్చిన ఇప్పటికీ ఈయన సినిమా ఎంట్రీ గురించి ఏ విధమైనటువంటి అధికారిక ప్రకటన లేకపోవడంతో ఈ విషయంలో నందమూరి అభిమానులు కాస్త నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.
ఇకపోతే తాజాగా మోక్షజ్ఞ సినీ ఎంట్రీ గురించి నటుడు బెల్లంకొండ గణేష్ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి బెల్లంకొండ గణేష్ మోక్షజ్ఞ సినీ ఎంట్రీ గురించి మాట్లాడారు.చిన్నప్పటి నుంచి తాను మోక్షజ్ఞ ఇద్దరు చాలా మంచి స్నేహితులమని తెలియజేశారు. ఇద్దరం కలిసి థియేటర్లకు వెళ్లి సినిమాలు చూసేవాళ్ళమని తెలిపారు.
ఇక మోక్షజ్ఞ ప్రస్తుతం హీరోగా ఇండస్ట్రీలోకి రావడం కోసం పెద్ద ఎత్తున శిక్షణ తీసుకుంటున్నారని తెలిపారు. ఇక ఈయన 2025 వసంవత్సరంలో ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టబోతున్నారంటూ ఈ సందర్భంగా బెల్లంకొండ గణేష్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అయితే మోక్షజ్ఞ కాస్త శరీర బరువు అధికంగా ఉండడంతో శరీర ఫిట్నెస్ పై కూడా ఫోకస్ పెట్టారని తెలిపారు.
ఇక మోక్షజ్ఞ (Mokshagna) ఎంతో అద్భుతంగా నటించగలరని గణేష్ వెల్లడించారు. అతనిలో మంచి నటన ప్రతిభ ఉందని, కనుబొమ్మలతోనే నటించగలడని తెలిపారు. ఎన్టీఆర్, బాలయ్య తరహాలో ఆయనకు నటనా స్కిల్స్ ఉన్నాయని చెప్పారు. ఐబ్రోస్ నటిస్తాయని, డైలాగ్ చెప్పేటప్పుడు కనుబొమ్మలే మాట్లాడతాయని, అలాంటి ప్రత్యేకమైన టాలెంట్ మోక్షజ్ఞలో ఉందని బెల్లంకొండ గణేష్ ఈ సందర్భంగా చేసిన ఈ కామెంట్స్ నందమూరి అభిమానులలో కాస్త ఉత్సాహాన్ని కలిగిస్తున్నాయి.