Nandini Reddy: ప్రెగ్నెంట్ అయితే జ్వరం అని చెప్పిన సమంత.. ఆ తర్వాత ఏమైందంటే?
- June 30, 2026 / 05:33 PM ISTByFilmy Focus Desk
ప్రముఖ కథానాయిక సమంత ప్రెగ్నెంట్ అని సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ సమయంలో ప్రేక్షకులకు, అభిమానులకు తెలిసింది. ఆ తర్వాత సినిమా సక్సెస్ మీట్‌లో సమంత అధికారికంగా ‘మెటర్నిటీ లీవ్’ తీసుకుంటున్నా అని క్లారిటీ ఇచ్చేసింది. అయితే సినిమా టీమ్‌కు ముందే తెలుసు. సినిమా టీమ్ అంతా తెలుసు అని చెప్పలేం కానీ.. డైరక్టర్, సినిమాటోగ్రాఫర్, డైరక్షన్ టీమ్, డ్యాన్స్ కొరియోగ్రాఫర్ లాంటి కీలక సభ్యులకు ముందే తెలిసే ఉంటుంది. అదెలా తెలిసింది, తెలిశాక ఏమైంది అనేది ఇటీవల దర్శకురాలు నందిని రెడ్డి చెప్పుకొచ్చారు.
Nandini Reddy
మామూలూగా 9 గంటలకు షూట్ ఉంది అంటే సమంత ఆ సమయానికి సెట్‌లో ఉంటుంది. ఈ సినిమాలో ‘తస్సాదియా..’ పాట షూటింగ్ అప్పుడు సమంతకు జ్వరం వచ్చిందని 11.30కు వస్తానని చెప్పింది. ఈ పాటను 4 రోజుల పాటు షూటింగ్ చేయాలని అనుకున్నాం. షెడ్యూల్ కారణంగా రెండు రోజులకే మార్చాం. ఆ టైమ్‌లో సమంతకు హెల్త్ బాలేదు అనేసరికి.. పాట ఎలా పూర్తవుతుందా అని టెన్షన్ పడ్డాను అని నందిని రెడ్డి చెప్పుకొచ్చారు.
అయితే, చెప్పినట్లే ఆ రోజు సమంత 11.30కు వచ్చి షూటింగ్ అవ్వగానే వెళ్లిపోయింది. రెండో రోజు రాగానే జ్వరం తగ్గిందా, అయినా ఎందుకు తరచూ వస్తోంది అని అడిగారట నందిని రెడ్డి. ‘జ్వరం కాదు.. నేను ప్రెగ్నెంట్‌ని. ఈ విషయం ఎవరికీ చెప్పకు’ అని సమంత చెప్పింది. ఆ మాటలు విని చాలా ఆనందమేసింది అని నందిని అన్నారు. సమంత ఆ మాట చెప్పగానే సమంతకు ఆరోగ్యం బాలేదు. ఎక్కువ రిహార్సల్స్ చేయించొద్దు అని చెప్పారట నందిని రెడ్డి.
దాంతో చిన్నచిన్న స్టెప్స్‌తో పాట పూర్తి చేశారట. అంతేకాదు కార్ యాక్సిడెంట్ సీన్, ఛేజింగ్ సీన్ కూడా సామ్ ప్రెగ్నెంట్ అని తెలిశాకే జాగ్రత్తలతో పూర్త చేశాం అని చెప్పారు. నీడలో షూటింగ్ ఉండేలా చూసుకున్నామని, ఆమె ఎక్కువ ఒత్తిడికి గురికాకుండా చూసుకున్నామని డైరక్టర్ పేర్కొన్నారు.















