స్టార్ హీరోయిన్ తో సందీప్ కిషన్ రొమాన్స్!

‘అలా మొదలైంది’ సినిమాతో దర్శకురాలిగా ఎంట్రీ ఇచ్చిన నందిని రెడ్డి మొదటి సినిమాతోనే సక్సెస్ అందుకుంది. ఆ తరువాత ఆమె తెరకెక్కించిన ‘జబర్దస్త్’ సినిమా ప్లాప్ కావడంతో దాదాపు మూడేళ్లు గ్యాప్ తీసుకొని ‘కళ్యాణ వైభోగమే’ సినిమాను రూపొందించింది. ఈ తరువాత సమంత హీరోయిన్ గా తెరకెక్కించిన ‘ఓ బేబీ’ సినిమా నందిని రెడ్డికి పెద్ద హిట్ తీసుకొచ్చింది. దీంతో యంగ్ హీరోలంతా కూడా నందిని రెడ్డితో కలిసి పని చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో నాగశౌర్య హీరోగా నందిని ఓ సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపించాయి.

అయితే ఇప్పటివరకు ఆ ప్రాజెక్ట్ ఊసు లేదు. అలానే సమంతతో కూడా మరో సినిమా చేస్తుందని అన్నారు. కానీ దీని గురించి ఎలాంటి అధికార సమాచారం లేదు. అయితే ఇప్పుడు నందిని రెడ్డి ఓ కొత్త సినిమా మొదలుపెట్టబోతుందని తెలుస్తోంది. ఇందులో సందీప్ కిషన్ హీరోగా కనిపిస్తాడట. పీపుల్స్ మీడియా సంస్థ ఈ సినిమాను తెరకెక్కిస్తోంది. కథ కూడా ఓకే అయిపోయిందని సమాచారం. నందిని రెడ్డి గతంలో రూపొందించిన సినిమాల మాదిరి ఇదొక రొమాంటిక్ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. ఇందులో హీరోయిన్ పాత్రకి చాలా ప్రాధాన్యం ఉంటుందట.

అందుకే ఈ పాత్ర కోసం ఓ స్టార్ హీరోయిన్ ని తీసుకోవాలని భావిస్తున్నారు. మరి సందీప్ కిషన్ తో రొమాన్స్ చేయడానికి ఏ స్టార్ హీరోయిన్ ఒప్పుకుంటుందో చూడాలి. ప్రస్తుతానికి ఈ హీరో ‘ఏ 1 ఎక్స్ ప్రెస్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. అలానే జి.నాగేశ్వరరెడ్డి సినిమాలో మరో సినిమా చేస్తున్నారు. వచ్చే ఏడాది ఆరంభంలో సందీప్ కిషన్, నందిని రెడ్డి కాంబినేషన్ లో సినిమా మొదలయ్యే ఛాన్స్ ఉంది.

Most Recommended Video

బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus