కెరీర్ ప్రారంభం నుండీ పక్కింటి అమ్మాయి తరహా పాత్రల్లో కనిపిస్తూ మెప్పించింది. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ ‘శ్రీనివాస కళ్యాణం’ ‘బ్లఫ్ మాస్టర్’ ‘ప్రేమ కథా చిత్రం 2’ ‘కల్కి’ ‘కపటదారి’ ‘అక్షర’ వంటి మంచి సినిమాలు చేసింది. తాజాగా ఈమె నటించిన ‘హిడింబ’ సినిమాలో ఆమె హీరోt అశ్విన్ తో సమానమైన పాత్రని పోషించింది. అలాగే ఘాటు లిప్ లాక్ లు, బెడ్ రూమ్ సన్నివేశాల్లో కూడా కనిపించి అదరగొట్టింది. దీనికి కారణం ఏంటని ఆమెను అడగ్గా..
‘ఆ క్యారెక్టర్ డిమాండ్ చేసింది. సీరియస్ గా సాగే రెండు పాత్రల మధ్యలో వచ్చే ఎమోషనల్ ట్రాక్ కి ఇది అవసరం. అందుకే చేశాను. గతంలో నేను ఇలాంటి సన్నివేశాల్లో నటించలేదు. ఇందులో చేయక తప్పలేదు’ అంటూ నందిత శ్వేత చెప్పుకొచ్చింది. ఇక రెండు రోజుల క్రితం రిలీజ్ అయిన ఈ సినిమాకి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్ లో నందిత పాల్గొంది.
అయితే ఆమె స్పీచ్ ఇస్తున్న టైంలో కన్నీటి పర్యంతమవ్వడం హాట్ టాపిక్ అయ్యింది. విషయం ఏంటి అంటే.. ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉండగా .. నందిత శ్వేత తండ్రి కన్నుమూశారట. కేవలం హిడింబ కథ నచ్చి ఈ సినిమాని ఎంతో ఇష్టంతో చేసిందట. అందుకే హాస్పిటల్లో ఉన్నప్పటికీ తన తండ్రిని విడిచిపెట్టి వచ్చిందట. అందుకే తన తండ్రిని తలుచుకుని ఈమె స్టేజి పైనే ఏడ్చేసింది. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది.