‘నాని 28’ ఆ క్రేజీ డైరెక్టర్ తో ఫిక్స్…!

గతేడాది ‘జెర్సీ’ తో హిట్ అందుకున్న నాని… ఆ వెంటనే ‘నానీస్ గ్యాంగ్ లీడర్’ తో కమర్షియల్ ఫెయిల్యూర్ ను మూటకట్టుకున్నాడు. ఇక ఈ ఏడాది కచ్చితంగా హిట్ ట్రాక్ కంటిన్యూ చెయ్యాలని నాని డిసైడ్ అయినట్టు ఉన్నాడు. ఇప్పటికే తన 25 వ చిత్రాన్ని ఇంద్రగంటి మోహన్ కృష్ణ డైరెక్షన్లో చేస్తున్న నాని.. అటు తరువాత 26 వ చిత్రాన్ని శివ నిర్వాణ డైరెక్షన్లో చేస్తున్నాడు. ప్రస్తుతం రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఈ చిత్రం షూటింగ్ జరుగుతుంది.

ఇక ఈ చిత్రం పూర్తైన తర్వాత ‘టాక్సీ వాలా’ దర్శకుడు రాహుల్ సంకృత్యన్ తో ‘శ్యామ్ సింగ రాయ్’ అనే చిత్రం చేస్తున్నాడు. ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇది నానికి 27 వ చిత్రం. వరుసగా 3 సినిమాలతో బిజీగా ఉన్న నాని.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన 28వ చిత్రాన్ని కూడా మొదలు పెట్టాలని చూస్తున్నాడట. ‘మెంటల్ మదిలో’ ‘బ్రోచేవారెవరురా’ వంటి హిట్ చిత్రాలను తెరకెక్కించిన వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ‘నాని 28’ ఉండబోతుందని సమాచారం. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబందించిన స్క్రిప్ట్ పనుల్లో వివేక్ ఆత్రేయ బిజీగా గడుపుతున్నాడట. ‘మైత్రి మూవీ మేకర్స్’ వారు ఈ ప్రాజెక్ట్ ను నిమించబోతున్నట్టు తెలుస్తుంది. ఏదేమైనా అన్నీ చాలా అట్రాక్ట్ చేసే ప్రాజెక్ట్ లు అనే చెప్పాలి.

Most Recommended Video

పలాస 1978 సినిమా రివ్యూ & రేటింగ్!
అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి సినిమా రివ్యూ & రేటింగ్!
ఓ పిట్టకథ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus