టాలీవుడ్ నుండి చాలా మంది హీరోలు బాలీవుడ్ డెబ్యూ ఇవ్వడం జరిగింది. రాంచరణ్ (Ram Charan) ‘జంజీర్’ (Zanjeer) తో, ప్రభాస్ (Prabhas) ‘ఆదిపురుష్’ (Adipurush) తో(స్ట్రైట్ హిందీ మూవీ), బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ( Bellamkonda Sai Sreenivas) ‘ఛత్రపతి’ తో, నితిన్ (Nithiin) ‘అజ్ఞాత్’ (Agyaat) తో, ఇంకా చాలా మంది హీరోలు బాలీవుడ్ డెబ్యూ ఇవ్వడం ఇవ్వడం జరిగింది. రానా (Rana) , విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) వంటి హీరోలు పాన్ ఇండియా సినిమాలతో హిందీ ప్రేక్షకులకి దగ్గరయ్యారు. ఎన్టీఆర్ (Jr NTR) కూడా ‘వార్ 2’ తో స్ట్రైట్ హిందీ మూవీ చేయబోతున్నాడు.
ఇప్పుడు నాని(Nani) బాలీవుడ్ ఎంట్రీ గురించి కూడా చర్చ జరుగుతుంది. హిందీలో నాని స్ట్రైట్ మూవీ చేస్తాడా? ఈ ప్రశ్న ఎందుకు వైరల్ అవుతుందంటే? ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram) పాన్ ఇండియా మూవీ కాబట్టి.. హిందీలో ప్రమోట్ చేయడానికి నాని ఇటీవల ముంబై వెళ్లడం జరిగింది. అక్కడి మీడియా వారు హిందీలో స్ట్రైట్ మూవీ ఎప్పుడు చేస్తారని నానిని ప్రశ్నించడం జరిగింది. ఇందుకు నాని.. ‘హిందీలో స్ట్రైట్ మూవీ చేయాలని నాకు ఇప్పటివరకు అనిపించలేదు.
ఎందుకంటే ఏ కథ కూడా.. నన్ను హిందీలో సినిమా చేసేలా ప్రేరేపించలేదు. నాకు అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) అంటే చాలా ఇష్టం. ‘అగ్నిపథ్’ సినిమాలో ఆయన ఎంట్రీ నాకు బాగా ఇష్టం. నాకు ఆ రేంజ్ కథ దొరికితే.. కచ్చితంగా స్ట్రైట్ హిందీ మూవీ చేస్తాను’ అంటూ నాని చెప్పుకొచ్చాడు. అయితే బాలీవుడ్ ప్రొడ్యూసర్స్ ‘యష్ రాజ్ ఫిలింస్’ వారి నిర్మాణంలో నాని ‘ఆహా కళ్యాణం’ (Aaha Kalyanam) అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే.