Nani: హీరో కాకపోయుంటే.. పోలీసుగా ఎప్పుడు.. ఫేవరెట్‌ క్రికెటర్‌.. నాని భలే ఆన్సర్లు

నేచురల్‌ స్టార్‌ అని ఏ ముహూర్తాన, ఎవరు పెట్టారో కానీ.. ఆ పేరుకు తగ్గట్టు నటిస్తూ, మెప్పిస్తున్నాడు. తాజాగా వచ్చిన ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram)  సినిమా ట్రైలర్‌ చూశాక అదరగొట్టేశాడు అని ప్రశంసలు వస్తున్నాయి. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా యూసఫ్‌గూడలోని బెటాలియన్‌లో శిక్షణ పొందుతున్న పోలీసులతో నాని  (Nani)  ఇటీవల ముచ్చటించాడు ఈ క్రమంలో ట్రైనీ కానిస్టేబుళ్లు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. ఒకవేళ మీరు నటుడు కాకపోయి ఉంటే అని అడిగితే.. కచ్చితంగా పోలీసు అయ్యేవాడిని అంటూ నవ్వేశాడు.

Nani

ఆ తర్వాత తన మనసులోని మాట చెప్పాడు. అదేనండీ ఎప్పుడూ చెప్పేదే.. థియేటర్‌లో ప్రొజెక్టర్‌ ఆపరేటర్‌గా పని చేసేవాడినని. ఇక మీ ఫిట్‌నెస్‌ రహస్యం చెబుతారా అని అడిగితే.. పెద్దగా డైట్‌ ఫాలో కాను అని, అమ్మ వండిన ప్రతిదీ తింటానని చెప్పాడు. స్వాతంత్ర్య పోరాటం నేపథ్య సినిమాలో నటించే అవకాశం వస్తే చేస్తారా అని అడిగితే.. ఫ్రీడమ్‌ ఫైటర్‌ బయోపిక్‌ అయితే ఓకే చెప్పేస్తా అని చెప్పాడు నాని. నటనలో మీకు స్ఫూర్తి ఎవరు అని అడగ్గా..

ఠక్కున కమల్‌ హాసన్‌ (Kamal Haasan)  పేరు చెప్పాడు నాని. మరి మీరెప్పుడు పోలీసు పాత్రలో నటిస్తారు అని అడిగితే.. ఇదిగో ‘సరిపోదా శనివారం’ సినిమా 29న విడుదల కాగానే.. కొత్త సినిమా చేస్తానని, అందులో పోలీసు ఆఫీసర్‌గా నటిస్తా అని చెప్పేశాడు. అది ‘హిట్‌ 3’ సినిమా అనే విషయం మనకు తెలిసిందే. రాజమౌళి  (S. S. Rajamouli) డైరెక్షన్ లో మళ్లీ సినిమా ఎప్పుడు చేస్తారు అని అడిగితే..

అది మనం అనుకుంటే కుదరదు కదా. రాజమౌళి అనుకోవాల్సిందే. ఆయనతో సినిమా చేయడానికి నేనే కాదు, మన దేశంలో ఏ నటుడైనా ఆసక్తిగా ఎదురుచూస్తుంటాడు. చూద్దాం ఎప్పుడొస్తుందో ఆ అవకాశం. మీ ఫేవరెట్‌ ఇండియన్‌ క్రికెటర్‌ ఎవరు అంటే.. మహేంద్ర సింగ్ ధోనీ అని చెప్పాడు నాని. ఆయన హీరోగా నటించిన సరిపోదా శనివారం సినిమా ఈ నెల 29న విడుదలవుతోంది.

వీరమల్లు విషయంలో అనుమానాలకు చెక్.. అప్పుడు రిలీజయ్యే ఛాన్స్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus