Ante Sundaraniki: జులై 8 నుంచి నెట్ ఫ్లిక్స్ లో ఓటీటీ స్ట్రీమింగ్ కానున్న అంటే సుందారానికి!

నాచురల్ స్టార్ నానిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని అంటే సుందరానికి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా థియేటర్లో మిశ్రమ ఫలితాలను అందుకుంది. కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో నాని సరసన మలయాళీ ముద్దుగుమ్మ నజ్రియా మొట్టమొదటిసారిగా పూర్తిస్థాయి తెలుగు చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఇక ఈ సినిమా జూన్ పదవ తేదీన ప్రేక్షకుల ముందుకు విడుదలైంది. ఈ సినిమా థియేటర్ 2 పూర్తి కావడంతో ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా ఓటీటీ హక్కులను నెట్ ఫ్లిక్స్ భారీ ధరకు కొనుగోలు చేశారు. ఈ క్రమంలోనే ఈ సినిమా తెలుగు, తమిళ్, మలయాళం భాషల్లో వచ్చే నెల 8 నుంచి ప్రసారం కానున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ విషయాన్ని నెట్ ఫ్లిక్స్ అధికారక పోస్టర్ ద్వారా వెల్లడించారు.

ఇక ఇందులో నాని బ్రాహ్మణ కుర్రాడిగా సందడి చేయగా, నజ్రియా క్రిస్టియన్ అమ్మాయిగా నటించారు. మతాంతర వివాహం అనే కథాంశంతో ఈ సినిమాని తెరకెక్కించారు. ఇక ఈ సినిమాలో సీనియర్ హీరో నరేశ్, రోహిణి, నదియా తదితరులు కీలక పాత్రల్లో నటించారు.థియేటర్లో మిశ్రమ స్పందన లభించుకున్న ఈ సినిమా డిజిటల్ మీడియాలో ఎలాంటి ఆదరణ సంపాదించుకుంటుందో తెలియాల్సి ఉంది. ఇకపోతే నాని నటించిన శ్యామ్ సింగరాయ్ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది.

ఈ సినిమా ఓటిటి హక్కులను కూడా నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసి భారీ లాభాలను పొందారు. ఈ క్రమంలోనే నాని తదుపరి చిత్రం అంటే సుందరానికి సినిమాని కూడా నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేశారు. ఇక నాని తదుపరి సినిమాల విషయానికి వస్తే ఈయన దసరా సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నారు.ఈ సినిమా అనంతరం మారుతి దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నట్లు వార్తలు వస్తున్నప్పటికీ ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus