Nani: నాని నమ్మకాన్ని ఆ మూవీ నిజం చేస్తుందా..?

  • April 3, 2021 / 06:06 PM IST

నాని గత సినిమా వీ ఓటీటీలో విడుదలై నెగిటివ్ టాక్ ను సొంతం చేసుకుని ఫ్లాప్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఆ సినిమా లాక్ డౌన్ వల్ల ఓటీటీలో విడుదల కాగా థియేటర్లలో విడుదలై ఉంటే మాత్రం భారీగా నష్టాలు వచ్చేవని ఇండస్ట్రీ వర్గాల నుంచి అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఆ సినిమా తరువాత నాని ప్రస్తుతం శివ నిర్వాణ డైరెక్షన్ లో టక్ జగదీష్ సినిమాలో నటిస్తున్నారు. నిన్నుకోరి, మజిలీ హిట్ల తరువాత శివ నిర్వాణ నానితో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు.

సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న దర్శకుడు కావడంతో ఈ సినిమా కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ నెల 23వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ పోస్టర్ ను విడుదల చేసిన నాని విలేకర్లతో మాట్లాడుతూ శివ నిర్వాణ ప్రేమ కథ చెబితే చేయకూడదని అనుకున్నానని కానీ 10 నిమిషాలు ఈ కథ వినగానే నో చెప్పలేకపోయానని తెలిపారు.

మట్టి వాసనతో నిండిన తెలుగు చిత్రం టక్ జగదీష్ అని నాని వెల్లడించారు. ఈ సినిమా వేరే సినిమాకు కాపీ అంటూ ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ సినిమా ఏ మూవీకి కాపీ కాదంటూ నాని స్పష్టం చేశారు. ఈ నెల 13వ తేదీన వైజాగ్ లో ట్రైలర్ ను విడుదల చేయబోతున్నామని నాని ప్రకటించారు. ఈ సినిమా ఫైనల్ కట్ చూసిన తరువాత టక్ జగదీష్ బ్లాక్ బస్టర్ అని ఫిక్స్ అయ్యానని నాని పేర్కొన్నారు. ఈ సినిమాలో నానికి జోడీగా రీతూవర్మ, ఐశ్వర్య రాజేష్ నటించారు.

సమ్మర్ లో రిలీజ్ అవుతున్న ఇతర సినిమాలు కూడా హిట్ అవ్వాలని కోరుకుంటున్నానని నాని తెలిపారు. అయితే నాని టక్ జగదీష్ స్టోరీ లవ్ స్టోరీ అయితే నో చెబుదామని అనుకున్నానని స్వయంగా చెప్పడంతో ఇకపై నాని ప్రేమకథలలో నటించరా..? అనే సందేహం వ్యక్తమవుతోంది. మరోవైపు టక్ జగదీష్ బ్లాక్ బస్టర్ హిట్ అని నమ్మకం పెట్టుకున్న నానికి ఈ సినిమా ఆ నమ్మకాన్ని నిజం చేస్తుందో లేదో చూడాల్సి ఉంది.

Most Recommended Video

వైల్డ్ డాగ్ సినిమా రివ్యూ & రేటింగ్!
సుల్తాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus