న్యాచురల్ స్టార్ నాని నటించిన హాయ్ నాన్న మూవీ టీజర్ తాజాగా విడుదల కాగా ఈ టీజర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. హాయ్ నాన్న సినిమా డిసెంబర్ నెల 7వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుండగా ఈ సినిమాతో నాని ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ చేరడం ఖాయమని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. సలార్ సినిమా రిలీజ్ డేట్ మారడం వల్ల హాయ్ నాన్న రిలీజ్ డేట్ మారింది.
ఈ సినిమా టీజర్ రిలీజ్ సందర్భంగా మీడియాతో మాట్లాడిన నాని ఆసక్తికర విషయాలను వెల్లడించారు. రిలీజ్ సమయానికి హాయ్ నాన్న కథ విషయంలో ప్రేక్షకులకు క్లారిటీ వస్తుందని నాని తెలిపారు. హాయ్ నాన్న మోస్ట్ కమర్షియల్ మూవీ అని నాని పేర్కొన్నారు. నచ్చింది చేయడం సులభమని నచ్చిన సినిమాలు చేస్తున్నానని నాని తెలిపారు. జెర్సీ సినిమా కమర్షియల్ గా సక్సెస్ సాధించిందని నాని అన్నారు.
మనస్సుకు నచ్చిన కథను కచ్చితంగా యాక్ట్ చేస్తానని నాని పేర్కొన్నారు. నా కొడుకు జున్నూతో నేను ఫ్రెండ్ లా ఉంటానని నాని కామెంట్లు చేశారు. హాయ్ నాన్న మూవీ నా కొడుకు గర్వపడేలా ఉంటుందని ఆయన తెలిపారు. ఒక కుటుంబంలో అన్నాదమ్ముల ఫంక్షన్స్ ఒకే రోజు ఉంటే అన్నయ్య కోసం తమ్ముడు డేట్ మార్చుకుంటాడని అలానే ప్రభాస్ అన్నయ్య కోసం తాను డేట్ మార్చుకున్నానని నాని చెప్పుకొచ్చారు.
లవ్ స్టోరీ, యాక్షన్ స్టోరీలతో డిసెంబర్ నెల కళకళలాడుతుంటే అంతకు మించి ఏం కావాలని నాని కామెంట్లు చేశారు. దసరా మూవీకి హిందీలో మంచి ఆదరణ లభించిందని నాని పేర్కొన్నారు. నేను నటించిన అన్ని సినిమాలలో లిప్ లాక్ సీన్స్ లేవని నాని అన్నారు. దర్శకుడు ఆ సీన్ కావాలని చెబితే కచ్చితంగా చేస్తానని నాని (Nani) అన్నారు. లిప్ లాక్ సీన్స్ తర్వాత మా ఇంట్లో గొడవలు జరుగుతాయని ఆయన తెలిపారు.