Nani: ఆ సినిమాల ఫలితాలతో టెన్షన్ లో నాని ఫ్యాన్స్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో బ్యాక్ గ్రౌండ్ లేకుండా సక్సెస్ అయిన హీరోలలో నాని ఒకరనే సంగతి తెలిసిందే. మాస్ సినిమాలతో పోలిస్తే క్లాస్ సినిమాలే నానికి ఎక్కువగా విజయాలను అందించాయి. ఎలాంటి పాత్రలో నటించినా తన నటనతో మెప్పించే అతికొద్ది మంది నటీనటులలో నాని ఒకరని చెప్పవచ్చు. వి, టక్ జగదీష్ సినిమాలతో నానికి చేదు ఫలితాలు ఎదురైనా శ్యామ్ సింగరాయ్ సినిమా కమర్షియల్ గా సక్సెస్ సాధించింది. సరైన సక్సెస్ దక్కితే నాని సినిమాలకు ప్రేక్షకాదరణ ఏ మాత్రం తగ్గదని ఈ సినిమా ప్రూవ్ చేసింది.

Click Here To Watch NOW

నాని ప్రస్తుతం అంటే సుందరానికి, దసరా సినిమాలలో నటిస్తున్నారు. అంటే సుందరానికి సినిమాలో క్లాస్ రోల్ లో నటిస్తున్న నాని దసరా సినిమాలో మాత్రం ఊరమాస్ రోల్ లో నటిస్తున్నారు. అయితే నాని గతంలో మాస్ రోల్స్ లో చేసిన సినిమాలు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. నాని నటించిన భీమిలి కబడ్డీ జట్టు, జెండాపై కపిరాజు సినిమాలు ప్రేక్షకుల్ని తీవ్రస్థాయిలో నిరాశపరిచాయి. పైసా, టక్ జగదీష్ సినిమాలలో కూడా నాని మాస్ రోల్స్ లోనే కనిపించారు.

ఆ సినిమాలు కూడా ప్రేక్షకుల్ని మెప్పించలేదు. దసరాలో నాని సింగరేణి కార్మికుడిగా కనిపిస్తుండగా ఈ సినిమా రిజల్ట్ విషయంలో నాని ఫ్యాన్స్ ఒకింత టెన్షన్ పడుతున్నారు. నాని పాత్ర సినిమాలో బాగా రఫ్ గా ఉంటుందని కులాల చుట్టూ ఈ కథ తిరుగుతుందని తెలుస్తోంది. శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాకు డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తుండగా భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది.

ఫుల్ నేటివిటీ టచ్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నానికి జోడీగా కీర్తి సురేష్ నటిస్తున్నారు. నేను లోకల్ సినిమా తర్వాత నాని కీర్తి సురేష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ ఇదే కావడం గమనార్హం. ఈ మధ్య కాలంలో సరైన సక్సెస్ లేని కీర్తి సురేష్ సర్కారు వారి పాట, దసరా సినిమాలపైనే ఆశలు పెట్టుకున్నారు.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus