Hero Nani: చేతిలో ఒకే ఒక మూవీ.. నాని నమ్ముకున్న సెంటిమెంట్ ఇదే!

ఈ జనరేషన్ హీరోలలో బ్యాగ్రౌండ్ లేకుండా స్టార్ స్టేటస్ ను అందుకున్న హీరో ఎవరనే ప్రశ్నకు న్యాచురల్ స్టార్ నాని పేరు సమాధానంగా వినిపిస్తోంది. కొన్నేళ్ల క్రితం వరకు వరుస విజయాలతో కెరీర్ ను కొనసాగించిన నాని ప్రస్తుతం వరుస ఫ్లాపులతో ఢీలా పడ్డారు. ప్రస్తుతం నాని చేతిలో దసరా మినహా మరో ప్రాజెక్ట్ లేదనే సంగతి తెలిసిందే. దసరా పండుగ కానుకగా దసరా మూవీ రిలీజవుతుందని ఫ్యాన్స్ భావించగా అందుకు భిన్నంగా జరిగింది.

డిసెంబర్ నెలలో ఈ సినిమాను విడుదల చేయాలని నాని భావిస్తున్నారని బోగట్టా. నాని సినీ కెరీర్ లోని బిగ్గెస్ట్ హిట్లలో ఒకటైన దసరా మూవీ డిసెంబర్ నెలలోనే విడుదలై సక్సెస్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ సెంటిమెంట్ ను రిపీట్ చేస్తూ దసరా సినిమాను డిసెంబర్ రిలీజ్ చేయాలని నాని భావిస్తున్నారని తెలుస్తోంది. మరోవైపు నాని కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించకపోవడంతో నాని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు.

మిడిల్ రేంజ్ హీరోలలో నంబర్ వన్ రేంజ్ లో ఉన్న నాని ప్రస్తుతం వరుస ఫ్లాపులతో కెరీర్ ను కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడటంతో అభిమానులు సైతం దిగులు చెందుతున్నారు. నాని ఒక్కో సినిమాకు 12 నుంచి 15 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ ను డిమాండ్ చేస్తున్నారని వార్తలు జోరుగా ప్రచారంలోకి వస్తుండటం గమనార్హం. రెమ్యునరేషన్ వార్తలపై నాని ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.

దసరా మూవీ నాని కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కుతోందని ఈ సినిమా బడ్జెట్ ఏకంగా 60 కోట్ల రూపాయలు అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే ఈ సినిమా నాన్ థియేట్రికల్ హక్కుల ద్వారా నిర్మాతలకు ఏకంగా 47 కోట్ల రూపాయల ఆదాయం చేకూరిందని బోగట్టా. సినిమా రిలీజ్ కు ముందే ఈ సినిమా ద్వారా నిర్మాతలకు లాభాలు దక్కే అవకాశం అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ది వారియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus