టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి అన్ని వర్గాల ప్రేక్షకుల్లో అభిమానులను సంపాదించుకున్న హీరోలలో న్యాచురల్ స్టార్ నాని ఒకరనే సంగతి తెలిసిందే. నాని నటించిన అంటే సుందరానికి సినిమా ఈ నెల 10వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. నాని, నజ్రియా, వివేక్ ఆత్రేయ ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటూ సినిమాపై అంచనాలను పెంచేశారు. ప్రస్తుతం నాని ఒక్కో సినిమాకు 12 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.
అష్టాచమ్మా నుంచి శ్యామ్ సింగరాయ్ వరకు సినిమాసినిమాకు నాని రేంజ్, మార్కెట్ సినిమాసినిమాకు అంతకంతకూ పెరుగుతోందనే సంగతి తెలిసిందే. అయితే సినిమాల్లోకి రాకపోయి ఉంటే ఏం చేసేవారనే ప్రశ్న నానికి ఎదురుకాగా తాజాగా నాని ఆ ప్రశ్నకు స్పందిస్తూ ఆసక్తికర విషయాలను సమాధానంగా వెల్లడించారు. సినిమాల్లోకి రాకుండా ఉండి ఉంటే థియేటర్లలో టికెట్ కలెక్టర్ గా పని చేసేవాడినని నాని కామెంట్లు చేశారు. టికెట్ కలెక్టర్ కావడం వల్ల ప్రతిరోజూ ప్రతి షోను ఫ్రీగా చూడవచ్చని నాని చెప్పుకొచ్చారు.
ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేలా ఈ సినిమా ఉండనుందని తెలుస్తోంది. సినిమాలో నాని బ్రాహ్మణ యువకుడిగా, నజ్రియా క్రిస్టియన్ అమ్మాయిగా నటించారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లో కూడా ఈ సినిమా థియేటర్లలో విడుదలవుతోంది. తమిళ, మలయాళ భాషల్లో నజ్రియాకు భారీ స్థాయిలో క్రేజ్ ఉంది. నజ్రియా క్రేజ్ వల్ల ఇతర భాషల్లో కూడా ఈ సినిమాకు భారీగా కలెక్షన్లు వచ్చే ఛాన్స్ అయితే ఉంది.
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు. సాధారణ టికెట్ రేట్లతోనే ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుందని సమాచారం అందుతోంది. అంటే సుందరానికి సినిమాతో నాని మరో సక్సెస్ ను ఖాతాలో వేసుకుంటారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం. దర్శకుడు వివేక్ ఆత్రేయకు ఈ సినిమా సక్సెస్ కీలకమని చెప్పవచ్చు.
Most Recommended Video
విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!