Nani: వామ్మో.. నాని ఆ రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారా?

  • March 6, 2023 / 02:50 PM IST

టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరైన నాని ఈ మధ్య కాలంలో సరైన సక్సెస్ లేక కెరీర్ విషయంలో ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. అంటే సుందరానికి సినిమా ఫుల్ రన్ లో 30 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం కలెక్షన్లను సాధించలేదు. అయితే నాని గత సినిమాలతో సంబంధం లేకుండా దసరా సినిమాకు బిజినెస్ జరుగుతోంది. దసరా సినిమా ఏకంగా 70 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం బడ్జెట్ తో తెరకెక్కింది.

అయితే నాని తన మార్కెట్ తో సంబంధం లేకుండా రికార్డ్ స్థాయిలో రెమ్యునరేషన్ ను డిమాండ్ చేస్తున్నారని తెలుస్తోంది. నాని ప్రస్తుతం ఒక సినిమా కోసం ఏకంగా 22 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ ను డిమాండ్ చేస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం. రవితేజ ఒక్కో ప్రాజెక్ట్ కు 20 కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషికం తీసుకుంటుండగా నాని అంతకంటే ఎక్కువ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నారు.

నాని ఈ స్థాయిలో పారితోషికం అడుగుతున్నారని తెలిసి ఇండస్ట్రీ వర్గాలు సైతం షాకవుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ కు తక్కువ మొత్తం ఖర్చవుతున్న నేపథ్యంలో నాని ఈ రేంజ్ పారితోషికం డిమాండ్ చేస్తున్నారని బోగట్టా. నాని వరుస ప్రాజెక్ట్ లతో విజయాలు అందుకోవడంతో పాటు రికార్డులు క్రియేట్ చేయాలని అభిమానులు భావిస్తుండటం గమనార్హం. నానికి సోషల్ మీడియాలో సైతం క్రేజ్ పెరుగుతోంది. కథల ఎంపిక విషయంలో నాని ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు.

నాని యంగ్ డైరెక్టర్లకు వరుసగా ఛాన్స్ ఇస్తుండటంతో అభిమానులు ఒకింత ఫీలవుతున్నారు. నాని రీమేక్ లకు సైతం దూరంగా ఉంటున్నారు. నానికి ఇతర భాషల్లో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. భిన్నమైన కథలను ఎంచుకోవడంతో పాటు స్టార్ డైరెక్టర్ల డైరెక్షన్ లో నటిస్తే నానికి క్రేజ్ మరింత పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. నాని భవిష్యత్తు ప్రాజెక్ట్ లు బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో సక్సెస్ సాధిస్తాయో చూడాలి.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus