నాచురల్ స్టార్ నాని జూన్ 10వ తేదీ అంటే సుందరానికి చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా ద్వారా నాని మరోసారి థియేటర్ వద్ద తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇక ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా నాని మాట్లాడుతూ బ్లాక్ బస్టర్ సినిమా చేసాము. ఈ సినిమాని ఎక్కడికి తీసుకెళతారో మీ ఇష్టం అంటూ సినిమా గురించి ఎంతో కాన్ఫిడెంట్ గా మాట్లాడారు.
ఇక ఈ సినిమా జూన్ 10వ తేదీ విడుదల కావడంతో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు. ఈ క్రమంలోనే మీడియాతో ముచ్చటించిన నాని సినిమా గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. ఈ క్రమంలోనే ఈ మీడియా సమావేశంలో భాగంగా నానికి పాన్ ఇండియా సినిమాలు గురించి ప్రశ్న ఎదురయింది. ఇప్పటికే జాతీయ భాష హిందీ అనే విషయం గురించి పెద్ద ఎత్తున వివాదం చెలరేగుతున్న సమయంలో నాని పాన్ ఇండియా సినిమాల గురించి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాన్ ఇండియా సినిమా అంటే కథను ప్లాన్ చేసి సినిమాని తెరకెక్కించి పాన్ ఇండియా అంటే సరిపోదు.మనం చేసిన సినిమా భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులు ఆదరించిప్పుడే అది పాన్ ఇండియా సినిమా అవుతుంది అంటూ నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉదాహరణకు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమా భాషతో సంబంధం లేకుండా అన్ని భాషలలోనూ అన్ని వర్గాల ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.
ఎక్కడో చిత్తూరులో పెరిగే ఎర్రచందనం స్మగ్లింగ్ గురించి తెరకెక్కిన ఈ సినిమా అన్ని భాషల ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. కథ నచ్చితే ఏ భాషా చిత్రం అయినా ప్రేక్షకులు ఆదరిస్తారు అంటూ ఈ సందర్భంగా నాని పాన్ ఇండియా సినిమాల గురించి వెల్లడించారు.
Most Recommended Video
విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!