ప్రస్తుతం తెలుగు ఫిలిమ్ ఇండస్ట్రీలో మోస్ట్ సక్సెస్ ఫుల్ హీరో ఎవరైనా ఉన్నారా అంటే అది నాని మాత్రమే. ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు ఏకంగా ఎనిమిది వరుస హిట్స్ తో సూపర్ ఫామ్ లో ఉన్నాడు. ఇక కెరీర్ ఖతం అనుకొంటున్న తరుణంలో “ఎవడే సుబ్రమణ్యం” సినిమాతో కమ్ బ్యాక్ హిట్ లా వచ్చిన అవకాశాన్ని మిస్ చేసుకోకుండా.. తర్వాత ఆచితూచి వ్యవహరించి వరుస విజయాలు అందుకొని ఒన్ ఆఫ్ ది మోస్ట్ డిపెండబుల్ హీరో అయ్యాడు నాని. ఇటీవలే నిర్మాతగా “అ!” సినిమాతోనూ సూపర్ హిట్ అందుకొని తనది లక్కీ హ్యాండ్ అని ప్రూవ్ చేసుకొన్నాడు.
అయితే.. ఇన్ని వరుస విజయాలు వస్తున్నా కూడా ఇంకా తనను యువ కథానాయకుడిగానే చూస్తుండడం మనోడికి నచ్చడం లేదు. అందుకే అర్జెంట్ గా స్టార్ లీగ్ లోకి ఎంటర్ అవ్వాలనుకొంటున్నాడు. అందుకు తగ్గట్లే తదుపరి చిత్రాల ఎంపికలో జాగ్రత్తలు తీసుకొంటున్నాడు. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేసేందుకు సన్నద్ధమైన నాని ఆ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించనున్నాడని తెలుస్తోంది. డి.వి.వి.దానయ్య ఈ ప్రొజెక్ట్ ను నిర్మిస్తాడట. ఈ ప్రొజెక్ట్ ఎప్పటికీ సెట్స్ కి వెళుతుంది అని ఇప్పుడే చెప్పలేం కానీ నాని-త్రివిక్రమ్ లకి ప్రస్తుతం ఉన్న కమిట్ మెంట్స్ అన్నీ కంప్లీట్ అయ్యాక ఈ ప్రొజెక్ట్ సెట్స్ మీదకి వెళ్తుంది.