Nani: కొత్త నానిని చూపించే కథ సిద్ధం చేసిన వేణు… త్వరలో ప్రకటన!

నానిని అందరూ పక్కింటి కుర్రాడు అని అంటుంటారు. అంటే బాయ్‌ నెక్స్ట్‌ డోర్‌ అని అన్నమాట. ఆ పేరుకు తగ్గట్టుగానే ఆయన కూడా అలాంటి పాత్రలే చేస్తూ వస్తున్నారు. ఒక్కోసారి ఆ పాత్రలు సరైన ఫలితాలు ఇవ్వకపోయినా… ఆయన కొనసాగిస్తూ వచ్చారు. అందుకే ఆయన చేసే ప్రతి ప్రయోగానికి మంచి ఫలితం దక్కాలని సగటు సినిమా ప్రేక్షకులు కూడా కోరుకునేంత అభిమానం సంపాదించాడు. మొన్నీమధ్య ‘దసరా’తో తెలంగాణ పోరగాడిగా కనిపించిన నాని మరోసారి అదే ప్రయత్నం చేస్తున్నారని టాక్‌.

‘బలగం’ సినిమాతో తొలి అడుగులోనే దర్శకుడిగా పురస్కారాలు, ప్రశంసలు అందుకున్నారు వేణు యెల్దండి. ఆ తర్వాత ఏ సినిమా చేస్తారు, ఎలాంటి కథతో వస్తారు అని అందరూ ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో దిల్‌ రాజు నిర్మాణంలోనే ఉండబోతోంది అని పుకార్లు వచ్చాయి. మరోవైపు నానిని ఓసారి ‘మీరు బలగం వేణుతో సినిమా చేస్తారా?’ అని అడిగితే… అవకాశం ఉంది అని చెప్పారు. ఇప్పుడు ఈ కాంబో కుదిరింది అని అంటున్నారు.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై నాని కథానాయకుడిగా వేణు ప్రాజెక్ట్‌ దాదాపు ఫిక్స్‌ అంటున్నారు. ఇప్పటికే కథా చర్చలు పూర్తయినట్లు సమాచారం. పీరియాడిక్‌ ప్రేమకథతో ఈ సినిమా రూపొందనున్నట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. తెలంగాణలోని ఓ పల్లెటూరిలో నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందట. ‘బలగం’ తరహాలో ఎమోషన్ల ప్రధానంగానే ఈ సినిమా ఉంటుంది అని చెబుతున్నారు. త్వరలోనే అనౌన్స్‌మెంట్‌ ఉంటుంది అని చెబుతున్నారు.

ఇక ఇటీవల ‘హాయ్‌ నాన్న’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన (Nani) నాని ప్రస్తుతం ‘సరిపోదా శనివారం’ అనే సినిమా చేస్తున్నాడు. వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా పూర్తి కాగానే ‘బలగం’ వేణు సినిమా ఉంటుంది అని చెబుతున్నారు. అయితే అంతకుముందే సినిమా ప్రారంభిస్తారని చెబుతున్నారు. అయితే వెంకటేశ్‌, నాని కాంబినేషన్‌లో త్రివిక్రమ్‌ ఓ సినిమా చేస్తారని వార్తలొచ్చాయి. అయితే ‘గుంటూరు కారం’ ఫలితం తర్వాత ఈ సినిమా విషయంలో ఎక్కడా ఎలాంటి టాక్‌ లేదు.

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus