‘ఫైటర్’ సినిమాలో విలన్ గా క్రేజీ హీరో?

ఈ ఏడాది విజయ్ దేవరకొండ నుండీ వచ్చిన క్రేజీ మూవీ ‘డియర్ కామ్రేడ్’.. ఘోర పరాజయాన్ని చవి చూసింది. ఈ చిత్రం ఫలితంతో తన తదుపరి సినిమాల గురించి జాగ్రత్త పడుతూ వస్తున్నాడు విజయ్. ప్రస్తుతం ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ ఫేమ్ క్రాంతి మాధవ్ డైరెక్షన్లో ‘వరల్డ్ ఫేమస్ లవర్’ చిత్రం చేస్తున్నాడు విజయ్. ఈ చిత్రం 2020 ఫిబ్రవరి 14న విడుదల కాబోతుంది. ఈ చిత్రం పూర్తయిన వెంటనే విజయ్.. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్లో ‘ఫైటర్’ అనే చిత్రాన్ని చేయడానికి రెడీ అవుతున్నాడు.

పూరి, ఛార్మి కలిసి నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ కు … బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ కూడా సహా నిర్మాతగా వ్యవహరించబోతున్నాడు. పాన్ ఇండియా చిత్రంగా ఈ ప్రాజెక్ట్ ను మలచాలనే ఉద్దేశంతో ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుతున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ చిత్రంలో విలన్ గా ‘ఆర్.ఎక్స్.100’ హీరో కార్తికేయ నటించబోతున్నాడు అనేది తాజా సమాచారం. ఇటీవల నానీస్ ‘గ్యాంగ్ లీడర్’ సినిమాలో కూడా కార్తికేయ విలన్ గా నటించిన సంగతి తెలిసిందే. ఇక మరో పక్క తమిళ స్టార్ హీరో అజిత్ సినిమాలో కూడా కార్తికేయ విలన్ నటిస్తున్నాడు అనే టాక్ నడుస్తుంది. మరి ఈ ప్రచారంలో ఎంతవరకూ నిజముందో తెలియాల్సి ఉంది.

రూలర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రతిరోజూ పండగే సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus