Nani: నాని జెట్ స్పీడ్.. జస్ట్ 3 నెలల్లో మరో సినిమా!

టాలీవుడ్‌లో నేచురల్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న నాని (Nani) , గత కొన్ని సంవత్సరాలుగా వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ప్రతి ఏడాదికి కనీసం రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకి తీసుకురావాలని ఆయన చేసే ప్రయత్నం ప్రశంసనీయంగా ఉంది. ప్రస్తుతం నాని ‘హిట్ 3’ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో పోలీస్ ఆఫీసర్‌గా కొత్త లుక్‌లో కనిపించబోతున్నారు. 100 కోట్ల భారీ బడ్జెట్ తో రానున్న ఈ సినిమాను 2025 మే 1న ఐదు భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నారు.

Nani

‘హిట్ 3’ తర్వాత ‘దసరా’ (Dasara) ఫేమ్ శ్రీకాంత్ ఓదేల (Srikanth Odela) దర్శకత్వంలో మరో ప్రాజెక్ట్‌తో నాని బిజీ కానున్నారు. ఈ ప్రాజెక్ట్‌ కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి మంచి కథతో రూపొందిస్తున్నట్లు సమాచారం. అలాగే లిస్టులో నాని సుజిత్ కాంబో కూడా ఉంది. అయితే ఈ సినిమా కంటే ముందే, నాని శివ నిర్వాణతో (Shiva Nirvana) కూడా మరో ప్రాజెక్ట్‌లో చేయబోతున్నారని టాక్ నడుస్తోంది. ఆసక్తికర విషయం ఏమిటంటే, ఈ సినిమాను కేవలం 3 నెలల్లో పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారట.

శివ నిర్వాణ గతంలో నానితో ‘నిన్నుకోరి’ (Ninnu Kori) మరియు ‘టక్ జగదీశ్’ (Tuck Jagadish) సినిమాలు చేశారు. ఇప్పుడు మరోసారి ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ఫ్యామిలీ బ్యాక్‌డ్రాప్‌లో కొత్త సినిమా రూపొందనుందని వార్తలు వస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్‌ కోసం మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ ముందుకు రావడం గమనార్హం. కొత్త తరహా కథ, స్టైలిష్ ఫ్యామిలీ డ్రామాతో ఈ సినిమా ఉంటుందని భావిస్తున్నారు.

ఇప్పటివరకు ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన రాలేదు, కానీ ఈ సినిమా త్వరలోనే మొదలవుతుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. శివ నిర్వాణ మరోవైపు నాగచైతన్య తో (Naga Chaitanya) కూడా ఒక సినిమా చేయాల్సి ఉంది. పూర్తి స్థాయిలో స్క్రిప్ట్ కూడా సిద్ధమైనట్లు సమాచారం. నాని ప్రాజెక్టు తరువాత ఆ కథ పట్టాలెక్కే అవకాశం ఉంది. ఇక నాగచైతన్య తండేల్ విడుదలకు రెడీ అవుతోంది.

 దిల్ రాజు రిస్క్ చేస్తున్నారా.. ఈ టైంలో తేడా వస్తే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus