Balakrishna , Nara Bhuvaneshwari: బాలా అన్నయ్యా థ్యాంక్స్.. భువనేశ్వరి ఎమోషనల్ ట్వీట్ వైరల్!

  • June 15, 2024 / 11:47 AM IST

స్టార్ హీరో బాలయ్య (Balakrishna) ఈ మధ్య కాలంలో పలు వివాదాల ద్వారా వార్తల్లో నిలిచినా ఆయనను దగ్గరినుంచి చూసిన వాళ్లు బాలయ్య భోళా మనిషి అని ఆయన మనస్సు కల్మషం లేని మనస్సు అని చెబుతారు. చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం సమయంలో బాలయ్య భువనేశ్వరి నుదుటిపై ప్రేమగా ముద్దు పెట్టుకోగా అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అయిన సంగతి తెలిసిందే. చెల్లెలు భువనేశ్వరిని బాలయ్య ఆప్యాయంగా పలకరించడంతో పాటు ప్రేమతో చెల్లెలు నుదుటిపై ముద్దు పెట్టగా భువనేశ్వరి సైతం బాలయ్యను ప్రేమగా హత్తుకున్నారు.

ఈ అన్నాచెల్లెలి అనుబంధానికి సంబంధించిన వీడియోను చూసి అభిమానులు సైతం ఎంతో సంతోషించారు. అయితే ఈ ఘటన గురించి భువనేశ్వరి స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేయగా ఆ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. “ఒక భార్యగా, అమ్మగా నా మనస్సు ఆనందంతో నిండిన క్షణాల్లో.. నాకు తోడబుట్టిన ప్రేమను పంచుతూ నా సంతోషాన్ని రెట్టింపు చేశావు.. థ్యాంక్స్ బాలా అన్నయ్య” అంటూ భువనేశ్వరి ట్వీట్ లో పేర్కొన్నారు.

భువనేశ్వరి చేసిన ఈ ట్వీట్ కు 37,000కు పైగా లైక్స్ వచ్చాయి. మరోవైపు బాలయ్య అతి త్వరలో షూటింగ్ లో పాల్గొననున్నారని సమాచారం అందుతోంది. బాలయ్య బాబీ (Bobby)  కాంబో మూవీ షూటింగ్ త్వరలో మళ్లీ మొదలుకానుందని తెలుస్తోంది. బాలయ్య ఈ సినిమా కోసం డేట్స్ కేటాయించారని భోగట్టా. దసరా పండుగకు ఈ సినిమా రిలీజ్ లేనట్టేనని తెలుస్తోంది.

సితార నిర్మాతలు బాలయ్య కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. బాలయ్య తన పారితోషికాన్ని 34 కోట్ల రూపాయలకు పెంచారని వార్తలు వినిపిస్తున్నాయి. బాలయ్య అఖండ2  (Akhanda) షూటింగ్ ను సైతం ఈ ఏడాదే మొదలుపెట్టనున్నారు. అఖండ సీక్వెల్ పై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus