‘లండన్ బాబులు’ ‘పలాస’ వంటి డీసెంట్ సక్సెస్ లు అందుకున్న రక్షిత్ అట్లూరి.. ఆ సినిమాలతో ప్రామిసింగ్ హీరో అనిపించుకున్నాడు. మాస్ ఆడియన్స్ కి రీచ్ అయ్యే సబ్జెక్టులు ఎలా ఎంపిక చేసుకోవచ్చో రక్షిత్ శెట్టి.. ఆ సినిమాల ద్వారా చాటి చెప్పాడు. ఇక మూడో ప్రయత్నంగా ‘నరకాసుర’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సెబాస్టియన్ దర్శకత్వం వహించాడు. పాపం.. అతను ఈ సినిమా షూటింగ్ టైంలో ప్రమాదవశాత్తు తన కుడి చెయ్యి కూడా కోల్పోయాడు.
అతని పై జాలితోనే ఈ సినిమా పై కొందరి దృష్టి పడింది. పైగా ఈ సినిమాలో హిజ్రాల యొక్క గొప్పతనాన్ని కూడా బాగా చెప్పాడు. ‘భరత్ అనే నేను’ సినిమా ప్రమోషన్స్ లో ‘హిజ్రాలని కమర్షియల్ సినిమాల్లో తక్కువ చేసి చూపిస్తున్నారు. వాళ్ళ గొప్పతనాన్ని చెబుతూ దర్శకులు మంచి కథలు రాయండి’ అంటూ మంత్రి కె.టి.ఆర్ చెప్పడంతో సెబాస్టియన్ ఈ ‘నరకాసుర’ కథని రాసుకున్నాడట. అతని ఆలోచన మంచిదే.
కానీ దానికి కమర్షియల్ హంగులు జోడించి చెప్పాలి అని చేసిన ప్రయత్నం దెబ్బ కొట్టింది. వెకిలి కామెడీ, ఎమోషనల్ కనెక్ట్ లేకపోవడం.. వంటివి ‘నరకాసుర’ ని పాస్ చేయలేకపోయాయి. అయితే మేకర్స్ మాత్రం.. తమ సినిమాకి మంచి టాక్ వచ్చిందని చెబుతున్నారు. వీకెండ్ తర్వాత అంటే సోమవారం నుండి ‘నరకాసుర’ సినిమాకి 1 +1 ఆఫర్ ఇస్తున్నట్టు ..
ఈరోజు ఓ ప్రెస్ మీట్ పెట్టి ప్రకటించారు. అలా కలెక్షన్స్ పెంచుకోవచ్చు అనేది వారి ఆశ. మరి వారి ప్రయత్నం ఎంతవరకు వర్కౌట్ అవుతుందో తెలీదు కానీ.. సోమవారం నుండి మాత్రం తెలుగు రాష్ట్రాల్లో ‘నరకాసుర’ (Narakasura) సినిమా ప్రదర్శించబడుతున్న థియేటర్స్ లో ఒక టికెట్ కొంటే, ఇంకో టికెట్ ఫ్రీ అనే ఆఫర్ అయితే అందుబాటులోకి రానుంది.
మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!
కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!