జూలై 8 నుండీ థియేటర్లు ఓపెన్ చేసేందుకు అటు అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిబ్యూటర్లు రెడీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ లో 50 శాతం ఆక్యుపెన్సీతో.. తెలంగాణలో 100శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు రన్ చేసుకోవడానికి ప్రభుత్వాల నుండీ అనుమతులు లభించాయి. కానీ డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు.. ఇదివరకటిలా సినిమాలను భారీ రేట్లు పెట్టి కొనుగోలు చేసే పరిస్థితి తక్కువగా ఉంది. అందుకే కొన్ని పెద్ద సినిమాలు ఓటిటి బాట పట్టేందుకు రెడీ అయ్యాయి.
ఇందులో వెంకటేష్ ‘నారప్ప’ మూవీ కూడా ఉంది.అమెజాన్ వారికి ఈ మూవీని నిర్మాతలు అమ్మేసినట్టు చర్చ నడుస్తుంది. అయితే అక్టోబర్ వరకు పెద్ద సినిమాలను ఓటిటికి అమ్మొద్దని ఇటీవల డిస్ట్రిబ్యూటర్లు,ఎగ్జిబిటర్లు నిర్మాతలకు విన్నపించుకున్నారు. ఈ క్రమంలో ‘నారప్ప’ నిర్మాతలలో ఒకరైన సురేష్ బాబు వారి విన్నపాన్ని స్వీకరిస్తారా? అనే విషయం పై ప్రస్తుతం నడుస్తున్న చర్చ..! సురేష్ బాబు నిర్మాత మాత్రమే కాదు డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ కూడా.!ఇండస్ట్రీలో అందరికంటే డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ల బాధలు ఈయనకే ఎక్కువ తెలుసు.
కానీ ఈయన ఓటిటి బాట పట్టడం డిస్ట్రిబ్యూటర్లను, ఎగ్జిబిటర్లను షాక్ కు గురిచేస్తుంది. ‘నారప్ప’ ని మాత్రమే కాదు ‘దృశ్యం 2’ ని కూడా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వారికి ఇచ్చేసారు సురేష్ బాబు.ఈ డీల్ ను ఫైనల్ చేసిన మాట నిజమే కానీ అఫీషియల్ గా సురేష్ బాబు సైన్ చేయలేదు అని వినికిడి. ఈ నేపథ్యంలో డిస్ట్రిబ్యూటర్లను, ఎగ్జిబిటర్లను దృష్టిలో పెట్టుకుని ఆ డీల్ ను ఆయన క్యాన్సిల్ చేసుకుంటారా? లేక ఒటిటికే ఓటేస్తారా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ డెసిషన్ అంత ఈజీగా తీసుకునేది అయితే కాదు..!