నిన్న అంటే డిసెంబర్ 13న విక్టరీ వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా ‘నారప్ప’ చిత్రాన్ని థియేటర్లలో రిలీజ్ చేశారు. అమెజాన్ ప్రైమ్ వారి కండిషన్ ప్రకారం నిన్న ఒక్క రోజు మాత్రమే ఈ మూవీ థియేటర్లలో ప్రదర్శింపబడింది. తమిళంలో సూపర్ హిట్ అయిన ‘అసురన్’ కి రీమేక్ గా తెరకెక్కిన ‘నారప్ప’ మూవీ కోవిడ్ సెకండ్ వేవ్ టైంలో నేరుగా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రిలీజ్ అయ్యింది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఇక్కడ మంచి రెస్పాన్స్ వచ్చింది.
‘సురేష్ ప్రొడక్షన్స్’ ‘వి క్రియేషన్స్’ బ్యానర్లపై సురేష్ బాబు, కలైపులి ఎస్ థాను ఈ చిత్రాన్ని నిర్మించారు. ఎక్కువగా ఫ్యామిలీ సినిమాలు, లవ్ స్టోరీస్ తీసే శ్రీకాంత్ అడ్డాల.. ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు అనే అప్డేట్ రాగానే సోషల్ మీడియాలో ఎలాంటి మీమ్స్ వచ్చాయో, ఎంత ట్రోలింగ్ జరిగిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కానీ ఇలాంటి సినిమాను కూడా అద్భుతంగా తీయగలను అని శ్రీకాంత్ అడ్డాల ప్రూవ్ చేసుకున్నాడు.
‘నారప్ప’ లో వెంకటేష్ అభిమానులు అలాగే మాస్ ఆడియన్స్ మెచ్చే అంశాలు చాలా ఉన్నాయి.అందుకే ఈ చిత్రాన్ని నిన్న థియేటర్లలో రిలీజ్ చేశారు. మరి ఈ సినిమా థియేటర్లలో ఎంత కలెక్ట్ చేసిందో తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలోనూ ఉంది. అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ చిత్రం 152 థియేటర్లలో రిలీజ్ అయ్యింది.
ఈవెనింగ్ షోలకు కొన్ని చోట్ల హౌస్ బోర్డులు పడ్డాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ రూ.24 లక్షల వరకు గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఓన్ రిలీజ్ కాబట్టి.. రూ.16 లక్షల వరకు షేర్ వచ్చినట్టు ట్రేడ్ పండితుల సమాచారం.
గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!