నందమూరి బాలకృష్ణ హీరోగా బి.గోపాల్ డైరెక్షన్లో తెరకెక్కిన ‘నరసింహ నాయుడు’ చిత్రం ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.2001 జనవరి 11న విడుదలైంది ఈ చిత్రం. అంటే ఈరోజుతో ‘నరసింహ నాయుడు’ విడుదలయ్యి 20 ఏళ్ళు పూర్తవుతుంది. టాలీవుడ్లో మొదటి 30కోట్ల గ్రాస్ ను వసూల్ చేసిన చిత్రం ఇది. అంతేకాదు మొదటి 20 కోట్ల షేర్ ను నమోదు చేసిన చిత్రం కూడా ఇదే.! ఇప్పటి లెక్కలను బట్టి చూసుకుంటే.. 100 కోట్ల షేర్ మూవీ ఇది అని చెప్పొచ్చు. అంతే కాదు.. 105 కేంద్రాల్లో నేరుగా 100 రోజులు ఆడిన మొట్ట మొదటి తెలుగు చిత్రం ‘నరసింహ నాయుడు’.
మరి ఈ చిత్రం ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో ఓ లుక్కేద్దాం రండి :
నైజాం | 5.55 cr |
సీడెడ్ | 4.90 cr |
ఉత్తరాంధ్ర | 2.20 cr |
ఈస్ట్ | 1.40 cr |
వెస్ట్ | 1.30 cr |
కృష్ణా | 1.45 cr |
గుంటూరు | 2.09 cr |
నెల్లూరు | 1.12 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా& ఓవర్సీస్ |
1.80 cr |
టోటల్ వరల్డ్ వైడ్ : | 21.81 cr |
అప్పటివరకూ టాలీవుడ్లో అత్యథిక కలెక్షన్లను రాబట్టిన చిత్రంగా ‘కలిసుందాం రా’ ఉండేది. ఆ చిత్రం కూడా సంక్రాంతికే విడుదలయ్యి 19 కోట్ల వరకూ షేర్ ను రాబట్టింది. ఆ చిత్రం కలెక్షన్లను ‘నరసింహ నాయుడు’ అధిగమించడం విశేషం.
Most Recommended Video
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలకు తల్లులు వేరైనా తండ్రులు ఒకరే..!
అల్లు అర్జున్ నుండి నాగ చైతన్య వరకు.. అందమైన స్టార్ కాపుల్స్.. సతీమణులే స్పెషల్ ఎట్రాక్షన్!