రమ్యను చూసి నరేష్, పవిత్ర లోకేష్ రియాక్షన్ ఏంటంటే..!

నటశేఖర, సూపర్ స్టార్ కృష్ణ.. తెలుగు ప్రజలందర్నీ శోకసంద్రంలో ముంచేసి తిరిగిరాని లోకాలకు తరలి వెళ్లిపోయారు.. ఆయన ఇకలేరు అనే మాటను ఇంకా ఎవరూ నమ్మలేకపోతున్నారు.. సాహసానికి చిరునామాగా, తెలుగు సినీ కళామతల్లి ముద్దుబిడ్డగా.. చిత్ర పరిశ్రమ మూలస్థంభాల్లో ఒకటిగా నిలిచిన.. ప్రేక్షకాభిమానుల మనసులు గెలిచిన కృష్ణ మరణంతో మహేష్ బాబు తీవ్ర విషాదంలో మునిగిపోయాడు.. ఈ ఏడాది జనవరిలో అన్నయ్య రమేష్ బాబు, సెప్టెంబర్‌లో అమ్మ ఇందిరా దేవి, నవంబర్‌లో నాన్న..

ఇలా ముగ్గుర్ని కోల్పోవడంతో ఆయన బాధ వర్ణనాతీతం.. మహేష్ కుమార్తె సితార, తాత గురించి సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ చూసి అంతా ఎమోషనల్ అవుతున్నారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, అభిమానులు, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, యామత్ టాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు కోలీవుడ్ ప్రముఖులు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు.. ఇలా ఎంతోమంది ప్రముఖులు కృష్ణ గారికి శ్రద్ధాంజలి ఘటించారు. మరికొంత మంది మొదటిరోజు హైదరాబాద్‌లో లేకపోయినా రెండో రోజు పద్మాలయా స్టూడియోకి చేరుకుని కృష్ణ గారికి నివాళి అర్పించారు..

సూపర్ స్టార్‌తో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. ఇక కృష్ణ గారి సీనియర్ అభిమానులైతే ఎక్కడెక్కడి నుండో హైదరాబాద్ వచ్చారు. తమ అభిమాన నటుడి పార్థివ దేహాన్ని చూసి గుండెలవిసేలా రోదించారు. విజయ నిర్మల కొడుకు, సీనియర్ నటుడు వీకే నరేష్ కూడా దగ్గరుండి అన్ని కార్యక్రమాలు చూసుకున్నారు. కృష్ణ చివరి చూపు కోసం పవిత్ర లోకేష్‌తో కలిసి పద్మాలయా స్టూడియోకి వచ్చారాయన.

కాగా, నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి కూడా మామ కృష్ణ చివరిచూపు కోసం పద్మాలయా స్టూడియోకి రావడం విశేషం. వ్యక్తిగతంగా తమ మధ్య ఎన్ని బేధాభిప్రాయాలు ఉన్నప్పటికీ, వాటన్నింటిని పక్కనపెట్టి రమ్య రఘుపతి.. కృష్ణ పార్థవదేహాన్ని దర్శించుకున్నారు. ప్రస్తుతం రమ్య రఘుపతి, కృష్ణ గారికి నివాళి అర్పించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus