సీనియర్ నటుడు నరేష్, ప్రముఖ నటి పవిత్రా లోకేశ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించి కొన్నిరోజుల క్రితం పరువుకు భంగం కలిగేలా కొన్ని వార్తలు ప్రచారంలోకి వచ్చాయనే సంగతి తెలిసిందే. ఈ వార్తలు తన దృష్టికి రావడంతో పవిత్రా లోకేశ్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించగా పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. అయితే సీనియర్ నరేష్ ఈరోజు నాంపలి కోర్టును ఆశ్రయించడం గమనార్హం.
పలు యూట్యూబ్ ఛానెళ్లు, వెబ్ సైట్ల ఓనర్లపై సీనియర్ నరేష్ పరువు నష్టం దావా వేశారు.
మొత్తం 12 మందిపై నరేష్ ఫిర్యాదు చేశారు. నరేష్ పవిత్రల గురించి ఫేక్ న్యూస్ ప్రచారం చేసినందుకు ఈ 12 మంది విచారణకు హాజరు కావాల్సి ఉందని సమాచారం. నరేష్ మూడో భార్య రమ్య రఘుపతికి కూడా ఈ నోటీసులు జారీ అయ్యాయి. తమపై జరిగిన ప్రచారం వెనుక రమ్య రఘుపతి ఉన్నారని నరేష్ పవిత్ర అనుమానిస్తున్నారు. నరేష్ పవిత్రా లోకేశ్ వ్యవహారంలో మరో కీలక మలుపు చోటు చేసుకోగా తమ గురించి తప్పుగా వైరల్ అవుతున్న వార్తల విషయంలో ఓపిక నశించడంతో నరేష్ ఈ విధంగా చేసినట్లు తెలుస్తోంది.
వ్యక్తిగత జీవితం గురించి తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్న వాళ్లను కఠినంగా శిక్షించాలని నరేష్ పవిత్ర కోరుకుంటున్నారు. ఇష్టానుసారంగా ప్రసారం చేస్తున్న వార్తల వల్ల నరేష్ పవిత్ర ఎంతో బాధ పడ్డారని సమాచారం. నాంపల్లి కోర్టు ఆదేశాల నేపథ్యంలో అసత్య ప్రచారం చేస్తున్న యూట్యూబ్ ఛానెళ్లు ఏ విధంగా స్పందిస్తాయో చూడాల్సి ఉంది.
ఇమేజ్ డ్యామేజ్ అయ్యేలా వరుసగా కథనాలు ప్రచురితం అవుతుండటంతో సీనియర్ నరేష్ పవిత్ర పోలీసులను, కోర్టును ఆశ్రయించారు. సీనియర్ నరేష్, పవిత్ర లోకేశ్ ప్రస్తుతం పలు మూవీ ఆఫర్లతో బిజీగా ఉన్నారు
గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!