Naresh: రాజకీయాలపై నరేశ్‌ కామెంట్స్‌ వైరల్‌

అల్లరి నరేశ్‌.. అల్లరి రోల్స్‌ మానేసి.. అదిరిపోయే రోల్స్‌కి వచ్చేశారు. అదేనండీ కామెడీ సినిమాలు తగ్గించేశారు. ‘నాంది’తో మొదలైన అల్లరి నరేశ్‌ ఈ ప్రయాణం ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’తో కంటిన్యూ అయ్యింది. ఈ సినిమాలో రాజకీయాల ప్రస్తావన బలంగా ఉంది. ఈ నేపథ్యలో అల్లరి నరేశ్‌ ఇటీవల మీడియా ముందుకు వచ్చినప్పుడు ఆ మాటలే వచ్చాయి. దానికి ఆయన చెప్పిన కామెంట్స్‌ వైరల్‌గా మారాయి. ‘నాంది’ నరేశ్‌ కెరీర్‌కు ఎంతో ముఖ్యమైన చిత్రం.

ఆ సినిమా తర్వాత ఒక సంపూర్ణమైన నటుడిగా ఆయన పేరు తెచ్చుకున్నారు. ఈ మాట మేం అనడం కాదు. ఆ సినిమాలో నటన చూసి ప్రేక్షకులు అన్నారు, ఇప్పుడు నరేశ్‌ కూడా అన్నారు. ఈ క్రమంలో ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ సినిమా చేశాను అని నరేశ్‌ చెప్పారు. సమాజంలో జరుగుతున్నదే మేము సినిమాలో చూపించామన్న ఆయన… ఈ సినిమా తర్వాత ప్రజల్లో ఎంతో కొంత మార్పు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

జనాలు, నాయకులు, ప్రభుత్వ అధికారులు.. ఇలా ప్రతి ఒక్కరి ఆలోచనా విధానం మారాలి అని ప్రశ్నించే చిత్రమిదని చెప్పిన నరేశ్‌.. ఇంచుమించు ఇలాంటి నినాదంతో ప్రజల్లోకి వెళ్తున్న పవన్‌ కల్యాణ్‌ – జనసేన గురించి మాట్లాడమని అడిగితే.. చక్కగా పక్కకు జరిగారు. ‘‘రాజకీయాలు నాకు ఏమాత్రం పరిచయం లేని విషయం. మంచి మార్పు కోసం ఎవరు పనిచేసినా.. మనం అభినందించాలి’’ అని చెప్పారంతే. మరి రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఉందా? అని అడిగితే.. రాజకీయాలంటే ఆసక్తి లేని అంశం.

అందులోకి వెళ్లాలని ఎప్పుడూ అనుకోలేదు. మనం ఉన్న రంగంలో వృద్ధి చెందితే చాలనే అనుకుంటాను. పూర్తిస్థాయి నటుడిగా విజయం సాధించాలి,, డైరెక్టర్‌ కావాలని ఆశ కూడా ఉంది. అంతే తప్ప రాజకీయాల్లోకి వెళ్లాలనే ఆలోచన లేదు అని క్లారిటీ ఇచ్చారు. నేను చాలా సున్నితమైన వ్యక్తిని. నాలాంటి వాళ్లు రాజకీయాలకు పనికి రారు అని నరేశ్‌ క్లారిటీ ఇచ్చాడు.

అయితే, మరి కామెడీ సినిమాలకు మీరు పూర్తిగా ఫుల్‌స్టాప్‌ పెట్టేసినట్లేనా అని అడిగితే.. అలా అని ఏమీ లేదు. కథలు వింటున్నాను. ‘నాంది’ తర్వాత సీరియస్‌, కంటెంట్‌ ఉన్న కథలు నా దగ్గరకు వస్తున్నాయి. మంచి కంటెంట్‌ ఉంటే కామెడీ సినిమాలు కూడా చేస్తా అని చెప్పాడు నరేశ్‌.

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus