ఇవివి సత్యనారాయణ చిన్నబ్బాయిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అల్లరి నరేష్. తన మార్క్ కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను అలరించి రాజేంద్ర ప్రసాద్ తర్వాత మరో రాజేంద్రప్రసాద్ లా సెటిల్ అయ్యాడు. కానీ 2011 లో ఈవీవీ గారు చనిపోవడం, 2013 నుండి బుల్లితెర జబర్దస్త్ వంటి కామెడీ షోల హవా మొదలవ్వడంతో అల్లరి నరేష్ సినిమాల్లో కామెడీ ప్రేక్షకులకు చాలా చిన్నదిగా కనిపించింది. అందువల్ల నరేష్ సినిమాలు వరుసగా ప్లాప్ అవుతూ వచ్చాయి.
‘మహర్షి’ హిట్ అయినా అందులో నరేష్ హీరో కాదు.. కథ అతని పై నడిచినా.. సినిమా మొత్తం మహేష్ ఇమేజ్ పైనే ఆడింది. కాబట్టి అది అల్లరి నరేష్ అకౌంట్లో పడలేదు. అయితే ‘నాంది’ మూవీ అల్లరి నరేష్ కు మంచు సక్సెస్ ను అందించింది. ఆ సినిమా నరేష్ ఇమేజ్ కు పూర్తి భిన్నంగా రూపొందింది. దీంతో అతని కెరీర్ గురించి చాలా కన్ఫ్యూజన్ ఏర్పడింది. ప్రస్తుతం అతను ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ అనే సినిమా చేస్తున్నాడు.
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు, ప్యాచ్ వర్క్ లు వంటివి జరుపుకుంటుంది ఈ చిత్రం. దాదాపు ఈ మూవీ కంప్లీట్ అయ్యింది.’సభకు నమస్కారం’ అనే చిత్రాన్ని అనౌన్స్ చేసినప్పటికీ దాని గురించి అప్డేట్ ఏమీ లేదు. కానీ నరేష్ మరో ప్రాజెక్టుకి ఓకే చెప్పినట్టు కథనాలు వినిపిస్తున్నాయి.
అయితే అందుతున్న సమాచారం ప్రకారం.. విక్రమార్కుడు, రగడ, పటాస్… వంటి హిట్ చిత్రాలకు కెమెరామెన్ గా పనిచేసిన సర్వేష్ మురారిని దర్శకుడిగా పరిచయం చేస్తూ నరేష్ ఓ సినిమా చేయబోతున్నాడట. సర్వేష్ మురారి చెప్పిన కథ నరేష్ కు బాగా నచ్చిందట.! దాదాపు ఈ కాంబినేషన్ సెట్ అయినట్టే అని వినికిడి. ఇది ఒక కమర్షియల్ ఎలిమెంట్స్ తో కూడుకున్న ఎంటర్టైనర్ అని తెలుస్తుంది.
యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?
‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!