Narne Nithiin: ఎన్టీఆర్ గురించి నార్నె నితిన్ కామెంట్స్ వైరల్..!

జూనియర్ ఎన్టీఆర్ బావమరిది, ప్రముఖ పారిశ్రామికవేత్త అయిన నార్నే శ్రీనివాసరావు కొడుకు నార్నే నితిన్ హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయిన సంగతి తెలిసిందే. మొదట నార్నే నితిన్ డెబ్యూ మూవీగా ‘శ్రీ శ్రీ శ్రీ రాజా వారు’ అనే మూవీ ప్రారంభమైంది. ‘శ్రీ వేదాక్షర మూవీస్’ బ్యానర్‌పై రామారావు చింతపల్లి మరియు MS రెడ్డి కలిసి ఈ చిత్రాన్ని నిర్మించేందుకు ముందుకు వచ్చారు.సతీష్ వేగేశ్న దర్శకుడు. అయితే ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్ళలేదు అని అప్పట్లో వార్తలు వచ్చాయి.

తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కి వీరాభిమాని అయిన నాగవంశీ నార్నె నితిన్ ను హీరోగా లాంచ్ చేసే బాధ్యత తీసుకున్నాడు. తన సోదరి హారిక నిర్మాణంలో రూపొందిన ‘మ్యాడ్’ అనే సినిమాతో నార్నె నితిన్ హీరోగా లాంచ్ అవుతున్నాడు. అక్టోబర్ 6 న ఈ సినిమా విడుదల కాబోతుంది. ఇక ఈ చిత్రం ప్రమోషన్లలో భాగంగా నార్నె నితిన్..

ఎన్టీఆర్ గురించి చెప్పిన కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ‘బావ నుండి నేర్చుకోవాలంటే చాలా నేర్చుకోవచ్చు. డాన్స్, ఫైట్స్, డైలాగ్స్ అన్నీ బావా అదరగొట్టేశాడు. కానీ ఆయన నాతో చెప్పింది ఒక్కటే. నీకు ఏ కథ అయితే సూట్ అవుతుందో దానిని నువ్వే ఎంపిక చేసుకోవాలి. దాని ఫలితాన్ని నువ్వే స్వీకరించాలి. దీనిని బట్టి భవిష్యత్తుని జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి అని అన్నారు’ అంటూ నార్నె నితిన్ (Narne Nithiin) చెప్పుకొచ్చాడు.

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus