Narne Nithin: బావ ఎన్టీఆర్ గురించి కామెంట్స్ చేసిన నార్నే నితిన్!

కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో సూర్యదేవర నాగ వంశీ నిర్మాణంలో ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ హీరోగా నటించిన చిత్రం మ్యాడ్. ఈ సినిమా అక్టోబర్ ఆరవ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా తాజా ఈ సినిమా నుంచి ట్రైలర్ లాంచ్ చేశారు. కామెడీ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి ఈ సినిమా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుందని నిర్మాత నాగ వంశీ ధీమా వ్యక్తం చేశారు.

తాజాగా నిర్వహించిన ట్రైలర్ లాంచ్ కార్యక్రమం అనంతరం చిత్ర బృందం మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా రిపోర్టర్లు హీరో నితిన్ ను ప్రశ్నిస్తూ మీ బావ ఎన్టీఆర్ గురించి చెప్పమని కోరారు. ఒకవేళ ఆయన నుంచి మీరు ఏ విషయాలను పూర్తిగా తీసుకుంటారు అంటూ ప్రశ్నించారు. అయితే ఈ ప్రశ్నకు నితిన్ చెప్పిన సమాధానం చూస్తే ఆయన ఈ విషయంలో కాస్త కన్ఫ్యూజ్ అయ్యారని చెప్పాలి.

ఈ సందర్భంగా నితిన్ (Narne Nithin) మాట్లాడుతూ బావ ఎన్టీఆర్ నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఆయనలో చాలా ఉన్నాయి ఆయన నుంచి రోజుకు ఒక పది కొత్త విషయాలు నేర్చుకోవచ్చు ఇలా నేర్చుకుంటూ పోతే సంవత్సరం మొత్తం ఆయన నుంచి కొత్త విషయాలు నేర్చుకోవచ్చు అంటూ ఈ సందర్భంగా నితిన్ సమాధానం చెప్పారు. ఇలా ఈయన మాటిమాటికి నేర్చుకోవచ్చు అని చెబుతున్నారు కానీ ఎన్టీఆర్ నుంచి స్ఫూర్తిగా ఏ విషయాలను నేర్చుకోవచ్చు అనే విషయంపై క్లారిటీ ఇవ్వలేదు.

ఇలా ఎన్టీఆర్ గురించి నితిన్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇక నితిన్ స్వయానా ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతికి సోదరుడు అనే విషయం మనకు తెలిసిందే. ఇక ఎన్టీఆర్ బావమరిది సినిమా విడుదలవుతున్నప్పటికీ ఎన్టీఆర్ ఈ సినిమా ప్రమోషన్లకు దూరంగా ఉన్నారు. అయితే ఈ సినిమా విడుదలకు సమయం ఉండటంతోనే ఎన్టీఆర్ తన సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారని తెలుస్తుంది.

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus