వెంకీ కుడుముల దర్శకత్వంలో యంగ్ హీరో నాగ శౌర్య నటించిన “ఛలో” సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత సుందర్ సూర్య దర్శకత్వంలో నటించిన “అమ్మమ్మగారిల్లు”, కణం సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద విజయం సాధించలేకపోయాయి. దీంతో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని సొంత ఐరా క్రియేషన్స్ బ్యానర్లోనే @నర్తనశాల మూవీ చేశారు. కృష్ణ వంశీ వద్ద శిష్యుడిగా అనేక సినిమాలకు చేసిన శ్రీనివాస చక్రవర్తి దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కింది. యామిని భాస్కర్, కష్మిర పరదేశి హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమా టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచాయి. మహతి స్వర సాగర్ అందించిన పాటలు మరింత క్రేజ్ ని తీసుకొచ్చాయి. అందుకే ఈ సినిమా శాటిలైట్ హక్కులు, డిజిటల్ హక్కులు మంచి ధరకు అమ్ముడుపోయినట్లు ఫిలిం నగర్ వాసులు చెప్పారు.
గతంలో “ఛలో” శాటిలైట్ .. డిజిటల్ హక్కులను ఒకరికే ఇవ్వడం వలన రెండున్నర కోట్ల వరకూ వచ్చాయి. ఇప్పుడు “నర్తనశాల” శాటిలైట్ హక్కులను స్టార్ మా టీవీ వారికీ, డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ కి ఇచ్చారు. అందువలన మొత్తం మూడున్నర కోట్లు వచ్చినట్టుగా వెల్లడించారు. నాగశౌర్య కెరీర్ లో ఇంత ధర పలకడం ఇదో తొలిసారి. నాగశౌర్య విభిన్నమైన రోల్ చేసిన ఈ మూవీ ఈనెల 30 న రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి పోటీగా ఏదీ విడుదల కాకపోవడంతో భారీ ఓపెనింగ్స్ వచ్చే అవకాశముందని ట్రేడ్ వర్గాల వారు అంచనా వేస్తున్నారు.