నాజర్.. పరిచయం అవసరం లేని పేరు. ఎన్నో విలక్షణమైన పాత్రలు పోషిస్తూ సుమారు 37 ఏళ్లుగా ఆయన ప్రేక్షకులను అలరిస్తున్నారు. చెప్పుకోవడానికి తమిళ నటుడే అయినప్పటికీ తెలుగులో కూడా ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించి ఇక్కడ కూడా స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నారాయన. 1989 వ సంవత్సరంలో వచ్చిన ‘కోకిల’ ‘ముద్దుల మేనల్లుడు’ చిత్రాలతో టాలీవుడ్ కు పరిచయమైన ఆయన ఆ తర్వాత వచ్చిన ‘మాతృదేవోభవ’ ‘చంటి’ ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ వంటి చిత్రాలతో బాగా ఫేమస్ అయ్యారు.
తెలుగులో ఈయన మొత్తంగా 150 కి పైగా సినిమాల్లో నటించారు. ‘దూకుడు’ చిత్రంతో కమెడియన్ గా కూడా మారి అద్భుతంగా కామెడీ చేయగలను, తెలుగు సొంతంగా డబ్బింగ్ చెప్పుకోగలను అని ప్రూవ్ చేసుకున్నారు.టాలీవుడ్లో నాజర్ కు మెగాస్టార్ చిరంజీవి బెస్ట్ ఫ్రెండ్. కానీ ఆయనతో కలిసి ఈయన నటించిన సినిమాలు చాలా తక్కువ. ఎవరి రికమండేషన్ లేకుండా సొంతంగా నటుడిగా ఎదగాలి అని ఆయన అనుకున్నారు అలాగే ఎదిగారు. ఇదిలా ఉండగా..
కొద్ది రోజులుగా ఈయన సినిమాలకు దూరం కాబోతున్నారు అనే వార్త ఎక్కువగా వినిపిస్తుంది. ఈ మధ్య కాలంలో నాజర్ సినిమాలను తగ్గించారు. సెలక్టివ్ గా పాత్రలను ఎంపిక చేసుకుంటున్నారు. ఇంకొన్ని రోజుల్లో ఆయన సినిమాలకు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయట. అందుకు ప్రధాన కారణం ఈయన అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉండడమే అని తెలుస్తుంది. లాక్‌డౌన్ టైంలో నాజర్ గుండె సంబంధిత సమస్యలతో బాధపడ్డారట.
అందుకే సినిమాలకు బ్రేక్ ఇచ్చి ఇక నుంచి పూర్తిగా ఆరోగ్యంపైనే ఆయన దృష్టి పెట్టాలనుకుంటున్నారు అని తెలుస్తుంది. ప్రస్తుతానికి ఆయన ఒప్పుకున్న సినిమాలను కంప్లీట్ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం పై నాజర్ నుండి లేదా ఆయన కుటుంబం నుండి క్లారిటీ రావాల్సి ఉంది.
Most Recommended Video
‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!