Nataraj Master, Balakrishna: బాలయ్య టాక్ షో కోసం బిగ్ బాస్ కంటెస్టెంట్!

నందమూరి బాలకృష్ణ ఓటీటీలో ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. ప్రముఖ డిజిటల్ ఫ్లాట్ ఫామ్ ‘ఆహా’ నిర్వహిస్తోన్న ‘Unstoppable’ అనే టాక్ షోకి బాలయ్య హోస్ట్ గా వ్యవహరించనున్నారు. త్వరలోనే ‘ఆహా’లో ఈ షో టెలికాస్ట్ కానుంది. రీసెంట్ గా ఈ షో లాంఛింగ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో చిత్రీకరించారు. బాలయ్యపై ఓ ఇంట్రడక్షన్ సాంగ్ ను షూట్ చేసినట్లు తెలుస్తోంది. దీనికి కొరియోగ్రాఫర్ నటరాజ్ మాస్టర్ డాన్స్ స్టెప్స్ కంపోజ్ చేసినట్లు తెలుస్తోంది.

ఈ సందర్భంగా బాలయ్యతో నటరాజ్ మాస్టర్ తీసుకున్న ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కొరియోగ్రాఫర్ గా సినిమాలు చేసిన నటరాజ్ మాస్టర్ కి బిగ్ బాస్ సీజన్ 5లో కంటెస్టెంట్ గా పాల్గొనే అవకాశం వచ్చింది. నాలుగు వారాల పాటు హౌస్ లో ఉన్న ఆయన నాల్గో వారంలో ఎలిమినేట్ అయ్యారు. హౌస్ లో ఉన్నన్ని రోజులు రవిని టార్గెట్ చేస్తూ వార్తల్లో నిలిచేవారు నటరాజ్ మాస్టర్.

ఇక బాలయ్య విషయానికొస్తే.. హోస్ట్ గా ఆయన్ను బుల్లితెరపై చూడడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. ఈ షో కోసం మంచు ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీలను గెస్ట్ లుగా తీసుకొస్తున్నారని సమాచారం. మరి వీరిని బాలయ్య తన ప్రశ్నలతో ఎలా ఇంటర్వ్యూ చేస్తారో చూడాలి. ప్రస్తుతం బాలయ్య నటించిన ‘అఖండ’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.

నాట్యం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సంకల్ప బలమే ‘మురారి’ ని క్లాసిక్ చేసింది, 20 ఏళ్ళ ‘మురారి’ వెనుక అంత కథ నడిచిందా…!
ఫ్యాక్షన్ సినిమాకి సరికొత్త డెఫినిషన్ చెప్పిన కృష్ణవంశీ ‘అంతఃపురం’…!
టాలీవుడ్‌ టాప్‌ భామల రెమ్యూనరేషన్‌ ఎంతంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus