Nataraj Master: బిగ్ బాస్ నాన్ స్టాప్ లో నటరాజ్ మాస్టర్ జెర్నీ ముగిసింది.! అసలు కారణం ఇదే..!

బిగ్ బాస్ నాన్ స్టాప్ హౌస్ లో ఈవారం ఎలిమినేషన్ లో భాగంగా నటరాజ్ మాస్టర్ ఎలిమినేట్ అయ్యారు. గత రెండు మూడు రోజులుగా అసహనంతో ఉన్న మాస్టర్ ఈవారం ఎలిమినేషన్ అవుతానని ముందుగానే ఊహించారు. అనుకున్నట్లుగానే , భయపడినట్లుగానే ఎలిమినేట్ అయ్యారు. బిందుతో నామినేషన్స్ అప్పుడు లక్ష్మణబాణం వేశారు. ఆడియన్స్ నీ ముక్కు కోస్తారు కాస్కో అంటూ మాట్లాడారు. అలాగే, అఖిల్ తో నీకు ఉన్నట్లుగా నాకు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ లేరు. నా కష్టంతోనే ఇక్కడి వరకూ వచ్చానంటూ మాట్లాడారు.

తర్వాత అనిల్ తో , బాబాభాస్కర్ తో కూడా ఆర్గ్యూమెంట్ పెట్టుకున్నారు. శివతో కూడా వాదన చేశారు. ఇలా గత వారం నుంచీ హౌస్ లో ఆయన అసహనాన్ని వ్యక్తం చేస్తునే ఉన్నారు. ఆడియన్స్ తో నేరుగా మాట్లాడి ఓటింగ్ అప్పీల్ చేసుకునేందుకు తహ తహలాడిపోతారు. అయితే, నటరాజ్ మాస్టర్ ఓటింగ్ అప్పీల్ చేసుకునేటపుడికే పుణ్యకాలం కాస్త దాటిపోయింది. శుక్రవారం కానీ అది టెలికాస్ట్ కాలేదు. ఇక శివది అయితే శనివారం టెలికాస్ట్ అయ్యింది. దీంతో శివకి కూడా ఓటింగ్ అప్పీల్ అనేది తర్వాత వారానికి పనికి వచ్చింది.

ఎట్టకేలకి నటరాజ్ మాస్టర్ జెర్నీ హౌస్ లో ముగిసింది. టాప్ – 5 కి వెళ్లకపోతే వేస్ట్ అంటూ మాస్టర్ మొత్తుకున్నారు. చాలా ఎమోషనల్ గా సాగిన జెర్నీలో ఈ సీజన్ లో నటరాజ్ మాస్టర్ చాలా హైలెట్స్ ఉన్నాయి. అలాగే మాస్టర్ చాలా షేడ్స్ చూపించారు. తేజస్వి, హమీదా, అరియానా, అఖిల్, బిందు, శివ, ఆఖరికి బాబాభాస్కర్ తో సహా అందరికో ఆర్గ్యూమెంట్స్ పెట్టుకున్నారు. లాజిక్ తో మాట్లాడకుండా, గేమ్ గురించి మాట్లాడకుండా, కొన్నిసార్లు పర్సనల్ గా కూడా దూషించారు. దీంతో హౌస్ మేట్స్ మాస్టర్ ని ఎదిరించారు.

కీలకమైన సమయంలో సపోర్ట్ చేయలేదు. అందుకే, మాస్టర్ మరింత బరెస్ట్ అయ్యారు. మరోవైపు బిందు – శివ ఇద్దరూ టాప్ 5కి వెళ్లబోతున్నారని మాస్టర్ ముందుగానే ఊహించారు. అందుకే, వాళ్లని టార్గెట్ చేసి మరీ ఎగ్జిట్ ఫ్రేమ్ కింద నిలబెట్టి మరీ తన కోపాన్ని తీర్చుకున్నారు. ముఖ్యంగా బిందుని టార్గెట్ చేసి పర్సనల్ గా మాట్లాడటం అనేది నటరాజ్ మాస్టర్ ఎలిమినేషన్ కి కారణం అయ్యిందనే చెప్పాలి. ఎందుకంటే, సోషల్ మీడియాలో బిందు ఫాలోవర్స్ అందరూ మాస్టర్ అన్న మాటలని వ్యతిరేఖించారు.

దీంతో మాస్టర్ ఎలిమినేట్ అవ్వక తప్పలేదు. అంతేకాదు, గత కొన్ని వారాలుగా మాస్టర్ కి ఓటింగ్ పర్సెంటేజ్ అనేది లేదు. కెప్టెన్ గా ఒకసారి, ఒకసారి ఎవ్వరూ నామినేట్ చేయకపోవడం వల్ల నామినేషన్స్ లోకి రాలేదు. దీంతో ఓటింగ్ కూడా అంతంత మాత్రంగానే జరిగింది. ఏది ఏమైనా ఈసారి సీజన్ లో నటరాజ్ మాస్టర్ తనదైన స్టైల్లో చెరగని ముద్ర వేశారనే చెప్పాలి. ఓటీటీ సీజన్ లో బెంచ్ మార్క్ ఆర్గ్యూమెంట్స్ తో సక్సెస్ అయ్యారు.

లాస్ట్ సీజన్ కంటే కూడ తన గేమ్ లో పవర్ ని చూపించారు. టాస్క్ లలో రెచ్చిపోయి మరీ ప్రాణం పెట్టి ఆడారు.కానీ, అస్తమానం నా బిడ్డకోసమే గేమ్ ఆడుతున్నా అంటూ ఎమోషనల్ అయిపోవడం, పదే పదే అదే మాట చెప్పడం అనేది ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వలేకపోయింది.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

10 ఏళ్ళ ‘గబ్బర్ సింగ్’ గురించి 12 ఆసక్తికరమైన విషయాలు..!
‘చెల్లమ్మ’ టు ‘మ మ మహేషా’.. జోనిత గాంధీ పాడిన 10 సూపర్ హిట్ పాటల లిస్ట్..!
ఎన్టీఆర్- బాలయ్య టు చిరు-చరణ్… నిరాశపరిచిన తండ్రీకొడుకులు కాంబినేషన్లు..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus