2020కి జాతీయ ఉత్తమ పురస్కారాల్ని కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. అందులో ‘మరక్కర్’ అనే మలయాళ సినిమాకు ఉత్తమ చిత్రం పురస్కారం లభించింది. దీంతో చాలామంది ఆ సినిమా ఎక్కడబ్బా అని గూగుల్‌లో తెగవెతికేశారు. ఓటీటీ యాప్‌లను ఒక రౌండ్ వేసేశారు. ఎక్కడా కనిపించకపోయేసరికి ఏమైందా అనుకున్నారు. అయితే ఆ సినిమా ఇంకా రిలీజ్ అవ్వలేదని ఈ ఏడాది మే 13న వస్తుందని తెలిసి.. అవునా ఇంకా రిలీజ్ అవ్వని సినిమాకి అవార్డు వచ్చిందా అనుకున్నారు.
పోనీలే మేలో చూసేద్దాం అనుకున్నారు. అయితే ఇప్పుడు ఆ సినిమా మేలో కూడా రావడం లేదు. మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ నటించిన చిత్రం ‘మరక్కర్’. ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ రూపొందించారు. 16వ శతాబ్దానికి చెందిన మలయాళ నౌక కెప్టెన్ కుంజలి మరక్కర్ కథ ఆధారంగా తెరకెక్కించారు. అర్జున్ సర్జా, సునీల్ శెట్టి, ప్రభు, మంజు వారియర్, కీర్తి సురేశ్ ఇతర ముఖ్యపాత్రధారులు. ఈ చిత్రం విడుదలకు ముందే మూడు జాతీయ పురస్కారాలు గెలుచుకుంది.
ఉత్తమ చిత్రం, ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్, ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ కేటగిరిల్లో జాతీయ పురస్కారాలు వచ్చాయి. చిరంజీవి ‘ఆచార్య’తో పాటే మే 13న ‘మరక్కర్’ ను విడుదల చేయాలని తొలుత నిర్ణయించారు. అయితే కరోనా పరిస్థితుల కారణంగా సినిమాను వాయిదా వేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. పరిస్థితులు చక్కబడ్డాక విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆగస్ట్ 12న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల చేయబోతున్నట్టు నిర్మాత తెలిపారు. ఇదంతా చూస్తుంటే సినిమాకు వచ్చిన పురస్కారం దర్శకనిర్మాతల ఇంటికి వచ్చాక సినిమా థియేటర్లలో వచ్చేలా కనిపిస్తోంది.
Most Recommended Video
ధూమపానం మానేసి ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసిన 10 మంది హీరోల లిస్ట్..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!
ఈ 12 మంది డైరెక్టర్లు మొదటి సినిమాతో కంటే కూడా రెండో సినిమాతోనే హిట్లు కొట్టారు..!