బాలీవుడ్‌లో మూవీ అంధధూన్(గుడ్డిరాగం) సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఆయుష్మాన్ ఖురానా నటించగా, టబు, రాధిక ఆప్టే కీలక పాత్రలు పోషించగా, శ్రీరామ్ రాఘవ దర్శకత్వం వహించారు. బాలీవుడ్‌లో చాలా తక్కువ బడ్జెట్‌తో వచ్చిన చిత్రాల్లో అంధధూన్ ఒకటి. దాదాపు 30 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ఇండియా వైడ్‌గా 72 కోట్లు, వరల్డ్ వైడ్‌గా 111 కోట్లు కలెక్ట్ చేసి, బీ టౌన్ వర్గాలతో పాటు, సినీ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపర్చింది.
కలెక్షన్లతో పాటు జాతీయ అవార్డును సొంతం చేసుకున్న అంధధూన్ చిత్రం పలు భాషల్లో రీమేక్ అవుతుంది. ముఖ్యంగా మన తెలుగు రీమేక్‌లో హీరోగా నటిస్తున్నారు. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో టబు ప్లే చేసిన కీ రోల్‌లో తమన్న, రాధిక నటించిన బోల్డ్ రోల్‌లో నభా నటేష్ నటిస్తున్నారు. రీమేక్ అయినా దాదాపు 40 కోట్లకు పైగానే బడ్జెట్ పెట్టి, స్టైలిష్‌గా ఈ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నారని సమాచారం.
ఇక అసలు మ్యాటర్‌లోకి వెళితే.. రీమేక్ అంటేనే కత్తి మీద సాములా ఉంటుంది. ముఖ్యంగా నేటి డిజిటల్ యుగంలో, ఏ భాషలో అయినా ఒక మూవీ బాగుందంటే.. సబ్‌టైటిల్స్ ఉంటాయి కాబట్టి ఆన్‌లైన్‌లో చూసేస్తున్నారు. ఆ ప్రభావం సినిమా పై పడుతుంది. దీంతో ఆ రీమేక్ సినిమా రిజల్ట్ పై ఎఫెక్ట్ పడుతోంది. ఉదాహరణకు తమిళ్ సూపర్ హిట్ మూవీ 96 తెలుగులో రీమేక్ చేసి, దిల్‌రాజు చేతులు కాల్చుకున్న సంగతి తెలిసిందే. ఇలా చెప్పుకుంటూ పోతే వర్కవుట్ కాని రీమేక్‌లే ఎక్కువ.
రీమేక్ అనగానే మేకర్స్ మన నేటివిటి, హీరో ఇమేజ్‌కు అనుగుణంగా మార్పులు చేర్పులు చేస్తారు. హీరో, హోరోయిన్‌తో పాటు కథలో కూడా మార్పులు జరుగుతాయి. ఒరిజినల్ మూవీ మూలకథ తీసుకున్నా, తెలుగు నేటివిటీకి దగ్గరగా ఉండేందుకు పలు మార్పులు చేస్తారు. ఎంతా తెలుగు ఫ్లేవర్ వచ్చేందుకు మార్పులు చేసినా, కొన్ని వర్కవుట్ అవుతాయి. మరికొన్ని కావు. మరి అంధాధున్ విషయానికి వస్తే.. ఈ చిత్రంలో టటు పాత్ర హైలెట్.
భర్తను మోసం చేసి, ఓ పోలీస్ ఆఫీసర్‌తో ఎఫైర్ నడుపుతూ, అనకోకుండా భర్తను చంపేసి, హీరోను ఓ రేంజ్‌లో ముప్పుతిప్పలు పెట్టే నెగిటివ్ పాత్రలో టబు నటన అదిరిపోతుంది. అలాగే రాధిక ఆప్టే పాత్రకు కూడా గ్లామర్ డోస్ ఎక్కువే. ఆయుష్మాన్, రాధికలకు సంబంధించి ఓ బెడ్ సీన్ కూడా ఉంటుంది. అయితే తెలుగు రీమేక్‌లో మాత్రం అలాంటివి ఉండవని నభా నటేష్ ఇటీవల కన్ఫర్మ్ చేసింది. తెలుగు ప్రేక్షకులకు నచ్చేలా మార్పులు చేసి తన పాత్రను డిజైన్ చేశారని నభా తేల్చి చెప్పింది.
అలాగే టబు పాత్రని కూడా పలు మార్పులు చేస్తేనే, తాను నటిస్తానని తమన్నా ఈ మూవీని ఓకే సేసిందట. ఇప్పటికే నేటివిటీకి తగ్గట్టు కథలో చేసే మార్పులు తేడా కొట్టడంతో పలు రీమేక్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి.. మరి ఈ నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీ అంధధూన్ రీమేక్ తెలుగులో వర్కవుట్ అవుతుందో లేదో అనేది ఇండస్ట్రీ వర్గాల్లో పెద్ద చర్చే జరుగుతుంది. మరి భీష్మతో సాలిడ్ హిట్ కొట్టి కమ్ బ్యాక్ అయిన నితిన్‌కు అంధధూన్ రీమేక్ ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.
Most Recommended Video
‘ఆర్.ఆర్.ఆర్’ : భీమ్ పాత్రకు రాజమౌళి ఆ పాయింటునే తీసుకున్నాడా?
‘బిగ్ బాస్’ అఖిల్ గురించి మనకు తెలియని విషయాలు..!
టాలీవుడ్లో 30 కోట్ల మార్కెట్ కలిగిన హీరోలు ఎవరో తెలుసా?