ఏ పండుగనైనా సినిమాతో సెలబ్రేట్ చేసుకునే దేశం మనది. అందుకే పండుగలు వచ్చాయి అంటే పెద్ద సినిమాలు రిలీజ్ అవుతుంటాయి . పండుగ రోజుల్లో సినిమాలు విడుదల చేసుకోవడానికి పెద్ద నిర్మాతలు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. దిల్ రాజు (Dil Raju) వంటి నిర్మాతలు అయితే పండుగల్ని టార్గెట్ చేసి సినిమాలు తీసి హిట్లు అందుకుంటున్న సందర్భాలు చూస్తూనే ఉన్నాం. ఇదిలా ఉండగా.. పండుగ రోజులు తప్పితే థియేటర్లకు జనాలు రావడం తక్కువైపోయింది.
ఇందుకు ప్రధాన కారణం టికెట్ రేట్లే అనడంలో సందేహం లేదు. ఒకప్పుడు అంటే కోవిడ్ కి ముందు టికెట్ రేట్లు మల్టీప్లెక్సుల్లో రూ.150 , సింగిల్ స్క్రీన్స్ లో రూ.100 ..గా ఉండేవి. కానీ కోవిడ్ తర్వాత టికెట్ రేట్లు భారీగా పెరిగిపోయాయి. ఇప్పుడు మల్టీప్లెక్సుల్లో రూ.295 , సింగిల్ స్క్రీన్స్ లో రూ.175 గా ఉన్నాయి. ఇవి చాలవు అన్నట్టు పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్న టైంలో టికెట్ రేట్ల పెంపు కోసం ప్రభుత్వాలకి రిక్వెస్ట్..లు పెట్టుకుంటున్నారు పెద్ద సినిమా నిర్మాతలు.
ఇవన్నీ ప్రేక్షకుల్ని థియేటర్లకు దూరం చేస్తున్నాయి అనేది వాస్తవం. అయితే సెప్టెంబర్ 20 న ‘జాతీయ సినిమా దినోత్సవం’ (National Cinema Day). పైగా శుక్రవారం. అంటే కొత్త సినిమాలు రిలీజ్ అయ్యే రోజు. ఈ శుక్రవారం పెద్దగా పేరున్న సినిమాలేవీ రిలీజ్ కావడం లేదు. కానీ గత వారం రిలీజ్ అయిన ‘మత్తు వదలరా 2’ (Mathu Vadalara 2) వంటి సినిమాలని పీవీఆర్, ఐనాక్స్ ,మిరాజ్ మూవీ టైమ్స్, డిలైట్ మల్టీప్లెక్సుల్లో రూ.99 కే చూడొచ్చు.