అసలు మన సోషియల్ మీడియా పరిస్థితి ఎంత దిగజారిపోయింది అంటే మాటల్లో చెప్పలేనంత, నిన్న వాళ్ళెవరో ఏకంగా షారూక్ ఖాన్ ఫ్లైట్ ఆక్సిడెంట్ లో చనిపోయాడు అంటూ వార్త పోస్ట్ చేసేసి షేర్ చేసేసారు. కట్ చేసి చూస్తే షారూక్ చివరకు నేను బ్రతికే ఉన్నాను బాబోయ్ అంటూ మీడియాకి తన గురించి చెప్పుకోవాల్సిన పరిస్థితి, ఇదిలా ఉంటే ఇప్పుడు మరి చీప్ పబ్లిసిటీ స్టంట్ కి వద్దాం. మెగాస్టార్ చిరు ఏదో పోల్ట్‌కల్ గా వర్కౌట్ కాక, చివరకు మళ్లీ సినిమాలపైనే ఆధార పడ్డాడు అని చెప్పక తప్పదు. అదే క్రమంలో 150వ సినిమా అయిపోయింది. హిట్ అందుకుంది. ఇప్పుడు 151గా ఉయ్యాలవాడ స్టోరీని తీస్తున్నట్లు బజ్. అయితే ఆ సినిమా అలా మొదలయిందో లేదో కానీ, మన ఉయ్యాలవాడ పై కొన్ని కధనాలు వచ్చేస్తూ ఉన్నాయి, అవేమిటంటే, రాయలసీమ ముద్దుబిడ్డగా.. తొలి తెలుగు స్వాతంత్ర్య సమరయోధుడిగా బ్రిటీష్ వలస పాలనపై తిరగబడ్డ ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని జాతీయ వీరుడిగా గుర్తించేందుకు కేంద్రం కసరత్తు మొదలు పెట్టింది అని, జాతీయ వీరుడిగా గుర్తించే దిశగా కేంద్రం అడుగులు పడ్డాయన్న ఆన్‌లైన్ లో బజ్ హల్‌చల్ చేస్తుంది.
ఇక దీనంతటికీ కారణం ఏంటి అంటే తమిళనాడు తెలుగు యువశక్తి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ని జాతీయ వీరుడిగా ప్రకటించే వినతి సమర్పించడంతో ఆ అంశాన్ని కేంద్రం పరిశీలిస్తుందని అంతేకాకుండా ఈ అంశాన్ని చూడాలంటూ పీఎంవో కేంద్ర హోంశాఖకు ఫైల్ సైతం పంపినట్లుగా సమాచారం. ఇక మరో పక్క రాజ్యసభ సభ్యుడు కమ్ మెగాస్టార్ చిరు ఈ పాత్రను పోషించటంతో ఉయ్యాల నరసింహారెడ్డి చరిత్ర ఇప్పుడు తెర మీదకు రావటమే కాదు… అలాంటి వీరుడ్ని టైమ్లీగా జాతీయ వీరుడిగా ప్రకటిస్తే… పొలిటికల్ గా ప్లస్ అవుతుంది అని కేంద్రం ఆలోచన చేస్తుందని సమాచారం. అయితే ఇదంతా చీప్ పబ్లిసిటీ అని, సినిమా హైప్ కోసమే తప్ప, ఇందులో నిజాలు ఏమీ లేవు అనేది కొందరు వాదన. ఏది ఏమైనా…సినిమా హైప్ కోసం ఇలాంటి పబ్లిసిటీ ఏమాత్రం మంచిది కాదు అనే చెప్పాలి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.