Sandhya Raju: సంధ్యారాజు బ్యాక్‌గ్రౌండ్‌ గురించి తెలిస్తే షాకవ్వాల్సిందే?

నిన్న విడుదలైన నాట్యం సినిమాకు ప్రేక్షకుల నుంచి యావరేజ్ రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రముఖ కూచిపూడి డ్యాన్సర్లలో ఒకరైన సంధ్యారాజు నటించగా రేవంత్ కోరుకొండ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. టాలీవుడ్ స్టార్ హీరోలు ఈ సినిమాను ప్రమోట్ చేయడంతో ఒక వర్గం ప్రేక్షకుల్లో ఈ సినిమాపై భారీస్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. అయితే సెలబ్రిటీలు సమయం కేటాయించి నాట్యం సినిమాకు ప్రమోషన్స్ చేయడంతో సంధ్యారాజు ఎవరనే చర్చ సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది.

నాట్యం సినిమాలో సంధ్యారాజు నటించడంతో పాటు ఈ సినిమాను నిర్మించారు. రాంకో సిమెంట్ ఇండస్ట్రీస్ యజమాని వెంకట రామరాజు పెద్ద కూతురైన సంధ్యారాజు వేల కోట్ల రూపాయలకు అధిపతి కావడం గమనార్హం. ఈమె ప్రముఖ కంపెనీ సత్యం కంప్యూటర్స్ వ్యవస్థాపకుడైన రామలింగరాజు చిన్నకోడలు కావడం గమనార్హం. సంధ్యారాజు మన దేశంతో పాటు ఇతర దేశాల్లో వెయ్యికి పైగా నృత్య ప్రదర్శనలు ఇచ్చారు.

సంధ్యారాజు ప్రస్తుతం సంధ్య స్పిన్నింగ్ మిల్స్ అనే కంపెనీకి ఎండీగా వ్యవహరిస్తున్నారు. నాట్యం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సంధ్యారాజు తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు. కమర్షియల్ సినిమాల కంటే అవార్డులు తెచ్చిపెట్టే సినిమాలకు సంధ్యరాజు పెద్దపీట వేస్తున్నారు. భవిష్యత్తులో కూడా సంధ్యారాజు నాట్యం ప్రధానంగా తెరకెక్కే సినిమాలలో నటించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. సంధ్యారాజు నటించిన సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించకపోయినా ఆమెను అభిమానించే అభిమానులు లక్షల సంఖ్యలో ఉన్నారు.

నాట్యం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సంకల్ప బలమే ‘మురారి’ ని క్లాసిక్ చేసింది, 20 ఏళ్ళ ‘మురారి’ వెనుక అంత కథ నడిచిందా…!
ఫ్యాక్షన్ సినిమాకి సరికొత్త డెఫినిషన్ చెప్పిన కృష్ణవంశీ ‘అంతఃపురం’…!
టాలీవుడ్‌ టాప్‌ భామల రెమ్యూనరేషన్‌ ఎంతంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus