నాట్యం ట్రైలర్: ఆమె పుట్టింది నాట్యం కోసమే!

ప్రముఖ కూచిపూడి డ్యాన్సర్ సంధ్య రాజు నాట్యం సినిమాతో త్వరలోనే వెండితెరపై సందడి చేయబోతున్నారు. గత కొన్ని రోజులుగా రెగ్యులర్ ప్రమోషన్స్ తో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా నిలుస్తున్న నాట్యం సినిమా ఓ వర్గం ప్రేక్షకులను మెల్లగా తనవైపుకు తిప్పుకుంటోంది. ఒక మంచి కథాంశంతో ఎమోషనల్ డ్యాన్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేయగా ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటోంది.

రామ్ చరణ్ తేజ్ చేతుల మీదుగా నాట్యం ట్రైలర్ ను సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో విడుదల చేశారు. ఒక గొప్ప నర్తకి కావాలని తండ్రి ప్రోత్సహించినప్పటికీ, సంధ్య రాజు కాదంబరి కథను ప్రదర్శించడానికి వ్యతిరేకించాడు. మేము కాదంబరి కథను ఎంచుకోలేదు, ఆ కథ మమ్మల్ని ఎంచుకుంటుంది. మేము దానిని మధ్యలో వదిలివేయలేము. కాదంబరి మన ద్వారా ఆమె కథను వివరించడానికి ప్రయత్నిస్తోంది.. అంటూ ఒక గొప్ప అంశంతో ఆమె కథ కొనసాగుతోంది.

మొత్తానికి సినిమా ట్రైలర్ తో మరోసారి చిత్ర యూనిట్ మంచి హైప్ క్రియేట్ చేశారు. చాలా కాలం తరువాత ఒక సంప్రదాయ నాట్యం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న కథ కావడంతో ఓ వర్గం ప్రేక్షకుల్లో సినిమా పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తున్నాయి. ఈ సినిమాకు ఇప్పటికే పలువురు స్టార్స్ ప్రమోషన్ విషయంలో బాగానే హెల్ప్ చేశారు. రేవంత్ కోరుకొండ దర్శకత్వం వహించిన ఈ సినిమా అక్టోబర్ 22న ప్రేక్షకుల ముందుకి రానుంది.

Read Today's Latest Trailers Update. Get Filmy News LIVE Updates on FilmyFocus