Naveen Polishetty: తనకు జరిగిన యాక్సిడెంట్ పై స్పందించిన నవీన్ పోలిశెట్టి!

గత ఏడాది ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ (Miss Shetty Mr Polishetty) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నవీన్ (Naveen Polishetty).. ఆ సినిమాతో మంచి ఫలితాన్నే అందుకున్నాడు. కానీ ఆ సినిమా వచ్చి ఏడాది కావస్తున్నా.. తన నెక్స్ట్ సినిమాని స్టార్ట్ చేయలేదు. కనీసం దాని గురించి అధికారిక ప్రకటన కూడా రాలేదు. ఇదిలా ఉండగా.. ఇటీవల నవీన్ పోలిశెట్టి అమెరికాలో యాక్సిడెంట్ పాలయ్యాడని ప్రచారం జరిగింది. అతని పరిస్థితి ఆందోళనకరంగా మారిందనే వదంతులు కూడా వినిపించాయి.

తాజాగా ఈ విషయాల పై క్లారిటీ ఇస్తూ.. నవీన్ పోలిశెట్టి ‘నా లైఫ్ అప్డేట్’ అంటూ ఓ లెటర్ ని విడుదల చేశాడు. నవీన్ పోలిశెట్టి ఆ లెటర్ ద్వారా స్పందిస్తూ..”ఈరోజు నేను మీతో నాకు సంబంధించిన ఒక పర్సనల్ విషయాన్ని షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. దురదృష్టవశాత్తూ నా చేతి బోన్ కి మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయ్యాయి. కాలికి కూడా గాయమైంది. ఇది నాకు టఫ్ మాత్రమే కాదు.. పెయిన్ ఫుల్ కూడా.! ముఖ్యంగా క్రియేటివ్ యాంగిల్ లో. ఈ గాయం వల్ల నేను ఫాస్ట్ గా నా చిత్రాలను మీ ముందుకు తీసుకురాలేకపోయాను..! అందుకు సారీ.

గత కొన్ని రోజులు చాలా టఫ్ గా గడిచాయి. నేను కంప్లీట్ గా రికవరీ అయ్యి.. మీకు నా బెస్ట్ ఎనర్జిటిక్ వెర్షన్ ని చూపించడానికి వైద్యుల సాయంతో వర్క్ చేస్తున్నాను. కానీ, దానికి ఇంకా కొన్ని నెలల టైం పట్టొచ్చు.నేను ముందు కంటే స్ట్రాంగ్ గా, హెల్తీగా కమ్ బ్యాక్ ఇవ్వాలని గట్టిగా ప్రయత్నిస్తున్నాను. గుడ్ న్యూస్ ఏంటంటే.. ఇప్పుడు డెవలప్మెంట్ లో ఉన్న నా అప్ కమింగ్ ఫిల్మ్ స్క్రిప్ట్స్ అద్భుతంగా, మీకు బాగా నచ్చే విధంగా రూపుదిద్దుకుంటున్నాయి.

నేను పూర్తిగా రికవరీ అయ్యాక వాటి షూటింగ్ ప్రారంభిస్తాము. మీ లవ్ అండ్ ఎంకరేజ్మెంట్ నాకు అన్నీ. నేను తిరిగి మీ ముందుకు రావాలన్న ఆశకి అవే మోటివేషన్. మీ సపోర్ట్ కీ, పేషన్స్ కి చాలా థ్యాంక్స్. అతి త్వరలో నేను మళ్లీ స్క్రీన్ పై కనిపించి, మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాను. మీరు ఎప్పటిలాగానే నా మీద మీ ప్రేమని కురిపించడానికి సిద్ధంగా ఉంటారని అనుకుంటున్నాను. విత్ లవ్, మీ జానే జిగర్ నవీన్ పోలిశెట్టి అంటూ ” అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ లెటర్ వైరల్ గా మారింది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus