Naveen Polishetty: ఇంటర్వ్యూ : ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ గురించి నవీన్ పోలిశెట్టి చెప్పిన ఆసక్తికర విషయాలు !

నవీన్ పోలిశెట్టి హీరోగా నటించిన ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ మూవీ ఈ మధ్యనే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలై రెండు వారాలు పూర్తయినా బాక్సాఫీస్ వద్ద ఇంకా సందడి చేస్తుంది. మూడో వీకెండ్ కి కూడా చెప్పుకోదగ్గ సినిమాలు లేవు కాబట్టి .. ఈ మూవీని ఇంకా ప్రమోట్ చేయాలని హీరో నవీన్ పోలిశెట్టి డిసైడ్ అయ్యాడు. దీంతో ఇంకా ఈ సినిమాని ప్రమోట్ చేస్తున్నాడు. ఈ క్రమంలో ఆయన చెప్పిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మీ కోసం :

ప్ర) ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సక్సెస్ ను ఎలా ఎంజాయ్ చేస్తున్నారు?

నవీన్ పోలిశెట్టి : నిజం చెప్పాలంటే ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నాను. రిలీజ్ టైం వరకు నేను చాలా టెన్షన్ పడ్డాను.ఎందుకంటే సెప్టెంబర్ 7న ‘జవాన్’ వంటి పెద్ద సినిమా రిలీజ్ అయ్యింది. రిలీజ్ కి ముందు నవ్వుతూ కనిపించాను కానీ చాలా టెన్షన్ పడ్డాను. మొదట ఇక్కడ పెద్దగా కలెక్ట్ చేయలేదు. కానీ తర్వాత పికప్ అయ్యింది. ఇప్పటికీ కలెక్ట్ చేస్తుంది. అంతా సేఫ్ కాబట్టి ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నాను.

ప్ర) టాలీవుడ్ స్టార్స్ చాలా మంది ఈ సినిమా పై ప్రశంసలు కురిపించారు.. ఎలా అనిపిస్తుంది?

నవీన్ పోలిశెట్టి : టాలీవుడ్ నుండి చాలా మంది స్టార్ హీరోలు, టెక్నీషియన్స్ మా సినిమాను అప్రిషియేట్ చేశారు.ఫస్ట్ మెగాస్టార్ చిరంజీవి గారు సినిమా చూసి రివ్యూ ఇచ్చారు. తర్వాత మాతో 2 గంటలపాటు మాట్లాడారు. నా పర్ఫార్మెన్స్ గురించి ఆయన చెబుతుంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఆ తర్వాత మహేష్ బాబు, రవితేజ, రాజమౌళి, చరణ్ గారు, సమంత..ఇంకా చాలా మంది చూసి అప్రిషియేట్ చేశారు.

ప్ర) హ్యాట్రిక్ సక్సెస్ లు కొట్టారు.. ఎలా అనిపించింది?

నవీన్ పోలిశెట్టి : ఈ మూడు సక్సెస్ లు నాకు ఒక్కో రకమైన సంతృప్తిని ఇచ్చాయి . నా ఫస్ట్ మూవీకి ముందు యూట్యూబ్ వీడియోస్ చేశాను. అవి చూసి బాగున్నాయి అన్నా కానీ ఎవరూ నాపై ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు రాలేదు. అలా మొదట వచ్చింది మా ఏజెంట్ సాయి శ్రీనివాస ప్రొడ్యూసర్. ఆ సినిమా నేను బాగా పర్ ఫార్మ్ చేయగలను అని ప్రూవ్ చేసింది. ఆ తర్వాత జాతి రత్నాలు టైమ్ లో పాండమిక్ వచ్చింది. అప్పుడు జనాలు సినిమాలు థియేటర్లో చూడరు అన్నారు. కానీ ఆ సినిమాకు వచ్చిన కలెక్షన్స్ చూసి…నవీన్ సినిమా థియేటర్ లో బాగా పే చేస్తుందనే నమ్మకం ప్రొడ్యూసర్స్, బయ్యర్స్ కి కలిగింది. ఇప్పుడు ‘జవాన్’ వంటి పెద్ద సినిమా పక్కన మా ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ వచ్చింది. మా సినిమా నిలబడదు అన్నారు. కానీ బాగా ఆడింది. సో అన్ని రకాలుగా నాలో కాన్ఫిడెన్స్ పెరిగింది.

ప్ర) స్టాండప్ కమెడియన్ గా చేయడానికి ఎలాంటి హార్డ్ వర్క్ చేశారు?

నవీన్ పోలిశెట్టి : హైదరాబాద్ తో పాటు ముంబై, యూఎస్ లో స్టాండప్ కమెడియన్స్ ను బాగా అబ్సర్వ్ చేశాను. వాళ్లు ఎలా చేస్తున్నారు ఒక టాపిక్ తీసుకుని అనేది చూశాను. అలా అబ్సర్వ్ చేయడంతో నాకొక సెన్స్ వచ్చింది. బాలీవుడ్ లో స్టాండప్ కామెడీ హిట్, తమిళంలో బాగా చూస్తారు. మన దగ్గర ఎందుకో సక్సెస్ కాలేదు అనే అపోహ ఉంది.సక్సెస్ కాలేదేమో కానీ సక్సెస్ కాదు అని అయితే అనుకోకూడదు. మనం పర్ఫెక్ట్ గా ట్రై చేస్తే తప్పకుండా సక్సెస్ అవుతుందని ఛాలెంజింగ్ గా తీసుకుని ఈ సినిమా చేశాను.

ప్ర) మొదటి రోజు ఈ సినిమాకి ఓపెనింగ్స్ తక్కువ ఉన్నప్పుడు టెన్షన్ వచ్చిందా?

నవీన్ పోలిశెట్టి : ఈ సబ్జెక్ట్ కి స్లోగా ఓపెనింగ్స్ వస్తాయని అనుకున్నాను. మాస్ కమర్షియల్ సినిమా అయితే ఆడియెన్స్ అలవాటు పడి ఉంటారు కాబట్టి వెళ్తారు. కానీ మేము ఓ కొత్త సెన్సిటివ్ పాయింట్ ను చెప్పాం కాబట్టి.. కొంచెం టైం పడుతుంది అని ముందుగానే అనిపించింది. చివరి 30 మినిట్స్ చేసిన పర్ఫార్మెన్స్ నేను గతంలో ఎప్పుడూ ఎక్స్పీరియన్స్ చేయలేదు.

ప్ర) మీ సినిమాల రైటింగ్ విషయంలో కూడా మీరు ఇన్వాల్వ్ అవుతారా?

నవీన్ పోలిశెట్టి : నటుడిగా ప్రతి సీన్ ని సెట్ లో ఇంప్రొవైజ్ చేసుకుంటాను. సీన్ లో నాలుగు జోక్స్ ఉంటే..నేను చేసేటప్పుడు ఏడుసార్లు ఆడియెన్స్ నవ్వాలని అనుకుంటా. అలాంటి ఫ్రీడమ్ కావాలని కోరుకుంటా.కాబట్టి నా డైరెక్టర్స అందరూ నాకు అలాంటి ఫ్రీడమ్ ఇచ్చారు. సీన్ పేపర్ లో ఉన్నది ఉన్నట్లు చేయడం నాకు ఇష్టం ఉండదు. అందుకే రైటింగ్ టైంలో నన్ను కూడా వచ్చి కూర్చోమంటారు.

ప్ర) భవిష్యత్తులో డైరెక్షన్ చేస్తారా?

నవీన్ పోలిశెట్టి :లేదండి.. నాకు ఆ టాలెంట్ అయితే లేదు..!(నవ్వుతూ)

ప్ర) మీకు ఎలాంటి కథలు చేయాలని ఉంది.. మీకు ఇన్స్పిరేషన్ ఎవరు?

నవీన్ పోలిశెట్టి : నాకు ప్రతి భాషలో ఫేవరెట్ యాక్టర్స్ ఉన్నారు. హిందీలో అమీర్ ఖాన్ అంటే ఇష్టం.ఆయన కథల ఎంపిక నాకు నచ్చుతుంది. అలాగే తెలుగులో చిరంజీవి గారు, ప్రభాస్ గారు. అన్ని జానర్స్ మూవీస్ ఇష్టం. హిందీలో రాజ్ కుమార్ హిరాణీ గారి మూవీస్ ఇష్టం. తెలుగులో భైరవ ద్వీపం, ఆదిత్య 369 నా ఫేవరేట్ మూవీస్. ప్రతి మూవీ సక్సెస్ నాపై హీరోగా బాధ్యత పెంచుతుంటుంది.

ప్ర) బాలీవుడ్ నుండి ఆఫర్స్ వస్తున్నాయా?

నవీన్ పోలిశెట్టి : వస్తున్నాయి.. కానీ నా (Naveen Polishetty) ఫస్ట్ ప్రిఫరెన్స్ తెలుగు సినిమా..!

ప్ర) రీమేక్ సినిమాల్లో నటించే అవకాశం ఉందా?

నవీన్ పోలిశెట్టి : అలా అని లేదండి. ఒరిజినల్ కథలనే డెవలప్ చేసి చేయాలని ఉంది. నా సినిమాలను తీసుకుంటే ‘ఏజెంట్’ చేస్తున్నప్పుడు తెలుగులో డిటెక్టివ్ రోల్స్ సక్సెస్ కావు అన్నారు. కానీ నా సినిమా సక్సెస్ అయ్యింది. తర్వాత ఈ సినిమా విషయానికి వస్తే ‘స్టాండప్ కామెడీ’ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన సినిమాలు కూడా సక్సెస్ కావు అన్నారు. కానీ అయ్యాయి కదా. సో ఇక్కడే మంచి అటెంప్ట్ లు చేస్తే ఆడియన్స్ బాగా ఎంకరేజ్ చేస్తారు అనే నమ్మకం ఉంది.

ప్ర) ‘అనగనగా ఒక రాజు’ డైరెక్టర్ మారిపోయాడు అని.. ప్రాజెక్ట్ ఆగిపోయిందని అంటున్నారు నిజమేనా?

నవీన్ పోలిశెట్టి : లేదండీ.. అందులో నిజం లేదు. తర్వాత ఆ సినిమా గురించి అన్ని డీటెయిల్స్ చెబుతాను.ఇప్పుడు ఈ సినిమా గురించి అడగండి.

ప్ర) మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి?

నవీన్ పోలిశెట్టి : ప్రస్తుతం మూడు సినిమాల్లో నటిస్తున్నాను. వాటి స్క్రిప్ట్స్ లాక్ అయ్యాయి. నెక్స్ట్ ఇయర్ మూడు మూవీస్ ఒక్కొక్కటిగా సెట్స్ పైకి తీసుకెళ్తాను. హిందీలో కూడా రెండు మూడు కథలు విన్నాను కానీ ముందు తెలుగు సినిమాలకే ప్రియార్టీ ఇస్తాను.

ప్ర) ఓటీటీల కోసం ఏమైనా హోస్ట్ గా చేసే ఛాన్స్ ఉందా?

నవీన్ పోలిశెట్టి : టైమ్ దొరికితే కపిల్ శర్మ వంటి షో హోస్ట్ చేయాలనీ ఉంది. అయితే ఇప్పుడు సినిమాలతోనే టైమ్ సరిపోతోంది.

మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus