Naveen Polishetty: గొప్ప కలలు కనడానికి గొప్ప వాళ్లే కావలసిన పనిలేదు!
- September 19, 2022 / 11:22 AM ISTByFilmy Focus
నవీన్ పోలిశెట్టి పరిచయం అవసరం లేని పేరు జాతి రత్నాలు సినిమా ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈయనకు ఉత్తమ నటుడిగా సైమా అవార్డును కూడా అందుకున్నారు. ఇలా జాతి రత్నం సినిమా మంచి హిట్ కావడంతో ఈయన తన తదుపరి చిత్రాన్ని యు వి క్రియేషన్ బ్యానర్ లో చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఇకపోతే జాతి రత్నం సినిమాకి గాను ఈయనకి ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్న విషయం మనకు తెలిసిందే.
ఇక ఈ అవార్డు అందుకోవడంతో నవీన్ పోలిశెట్టి తన సినీ కెరియర్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సినిమా హీరో కావాలని గొప్ప గొప్ప కలలు కనడానికి మనం గొప్ప వాళ్ళం కాదు అంటూ చిన్నప్పుడు తనకు ఎంతోమంది చెప్పారు. ఇదే రోజు ఆ అబ్బాయి ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు అంటూ ఈయన ఎమోషనల్ అయ్యారు. నటుడిగా తాను ఈ స్థాయికి చేరుకోవడానికి చాలా సమయం పట్టిందని ఈ స్థాయికి రావడానికి ఎన్నో నిద్రలేని రాత్రులు కన్నీళ్లు కష్టాలు ఇలాంటివి ఎన్నో చూశాను

ఇవన్నీ ఎదుర్కొన్న తర్వాతే తాను ఇక్కడికి చేరుకున్నానని ఈ సందర్భంగా ఈయన తన కష్టాలను తెలియజేశారు. మన లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఈ కష్టాలు అన్నింటిని భరించాల్సిందేనని వీటిని ఎదుర్కొన్నప్పుడే మనం కన్న కలలు నిజమవుతాయంటూ నవీన్ పోలిశెట్టి ఈ సందర్భంగా తెలియజేశారు.ఇలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చేవారికి ఇలాంటి కష్టాలు ఎదురవుతాయని అయితే ఈ జర్నీలో ప్రోత్సహించే వాళ్ళు విమర్శించే వాళ్ళు కూడా ఉంటారు వాటన్నింటిని ఎదుర్కొంటేనే ఇండస్ట్రీలో నిలబడగలమని ఈ హీరో తెలిపారు .
ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా రివ్యూ & రేటింగ్!
Most Recommended Video
శాకిని డాకిని సినిమా రివ్యూ & రేటింగ్!
నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ గీతు రాయల్ గురించి ఆసక్తికర విషయాలు..!
















