నవీన్ పోలిశెట్టి (Naveen Polishetty) .. పరిచయం అవసరం లేని పేరు. టాలీవుడ్లో ఉన్న క్రేజీ హీరోల్లో ఒకరు అని మాత్రమే సరిపెట్టలేం. తక్కువ టైంలో ప్రామిసింగ్ హీరోగా ఎదిగాడు. ఇతనితో సినిమా చేస్తే.. ‘మినిమమ్ గ్యారంటీ’ అనే నమ్మకాన్ని సంపాదించుకున్నాడు. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’ (Agent Sai Srinivasa Athreya) ‘జాతి రత్నాలు’ (Jathi Ratnalu) ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ (Miss Shetty Mr Polishetty) వంటి సూపర్ హిట్లు నవీన్ ఖాతాలో పడ్డాయి. ఇప్పుడు అతనితో సినిమాలు చేయడానికి టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థలు ఎగబడుతున్నాయి.
కానీ నవీన్ మాత్రం హడావిడిగా సినిమాలు చేయాలి అనుకోవడం లేదు. ఆచి తూచి అడుగులు వేస్తున్నాడు. ‘సితార ఎంటర్టైన్మెంట్’ బ్యానర్లో ‘అనగనగా ఒక రాజు’ అనే సినిమా చేస్తున్నట్టు నవీన్ పోలిశెట్టి ప్రకటించాడు. కానీ అది ఇంకా సెట్స్ పైకి వెళ్ళలేదు. డైరెక్టర్ చెప్పిన స్క్రిప్ట్ నచ్చకపోవడం వల్ల నవీన్ ఆ సినిమాని ఇంకా మొదలుపెట్టలేదు అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. అలాగే ‘షైన్ స్క్రీన్స్ ‘ బ్యానర్లో కూడా అతను ఒక సినిమా చేయాలి.
ఆ విషయాలు పక్కన పెట్టేస్తే నవీన్ పోలిశెట్టికి ఇటీవల బైక్ యాక్సిడెంట్ అయినట్టు సమాచారం. రెండు రోజుల క్రితం ఆయన బైక్ స్కిడ్ అయ్యి కింద పడ్డాడట. దీంతో నవీన్ చెయ్యి ఫ్రాక్చర్ అయ్యిందట. దీంతో అతను అమెరికాలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. కోలుకోవడానికి కనీసం 3 నెలల వరకు టైం పడుతుందట. దీని పై నవీన్ పోలిశెట్టి అధికారికంగా స్పందించింది అయితే ఏమీ లేదు.
సైలెంట్ గా పెళ్లి పీటలెక్కిన ‘బిగిల్’ నటి ఇంద్రజ..!
కర్ణాటకలో సినిమాలు బ్యాన్ అంటున్నారు… మన దగ్గరా అదే చేస్తారా?
ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 18 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్